♦️The opinions expressed within the content are solely the author's and do not reflect the opinions and beliefs of the website or its affiliates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ఈ వ్యాసం.
దేశములో- గౌరవనయులైన- మూర్ఖులు- అనే పుస్తకం నుండి?
రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత.
____________________________
పాఠకులు కొంత సమయాన్ని కేటాయించి చదవగలరు ఆశిస్తున్న.
మీ
చిన్నం కాళయ్య,
దళిత హక్కుల పోరాట సమితి(dhps) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి.
గతంలో అఖండ భారత్ సామ్రాజ్యం వర్ధిల్లుతుందని, దాన్ని హిందూ రాజులు పరిపాలించారని ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు చెబుతున్నారు.కాస్త చరిత్ర పరిజ్ఞానం ఉన్న వారికి నిజాలు తెలుస్తాయి. భ్రమలో బ్రతికే వారికి నిజాలు రుచించవు.పైగా, గతంలో లాగా అఖండ హిందూ రాజ్యాన్ని స్థాపించు కోవాల్సి ఉందని కూడా ఏలినవారు చెబుతున్నారు.విషయం స్పష్టం కావాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి.బౌద్ధడైనా అశోక చక్రవర్తి, ముస్లిం అయినా అక్బర్ క్రైస్తవులైన బ్రిటిష్ పాలకొల్లు అఖండ భారత్ ను పరిపాలించారు. అది హిందూ భారత్ కాదు.అప్పటి హిందూ రాజులు తమలో తాము గర్షణ పడేవారు.యుద్ధాలు చేసుకునేవారు.కనీసం ఐదు వందల మైళ్ళు విస్తీర్ణం గల రాజ్యాలను కూడా పాలించు కాలేకపోయారు.ఓడిపోయిన రాజ్యాన్ని, దానితోపాటు తమ ఆడవాళ్ళని శత్రువులకు ఇచ్చి చతికిల పడేవారు.చరిత్రలో హిందూ రాజులు అఖండ భారత్ ను ఎప్పుడు పాలించలేదు.అఖండ భారత్ తో హిందువులకు సంబంధమే లేదు.ఇప్పుడు అధికారంలో లో ఉన్న మన పాలకులు ఏమిటి అబద్ధాలు చెబుతున్నారు? అని ఆశ్చర్యపోనక్కర్లేదు.వారి పుట్టుక, ఎదుగుదల, అధికారంలోకి రావడం అన్ని అక్రమ మార్గంలో నే కాబట్టి, వారికి నిజాలు రుచించవు.ఒకప్పటి అఖండ భారత్ స్థాపించడం పుట్టి కోతుల తప్ప మరొకటి కాదు.అటు పాకిస్థాన్, ఇటు బంగ్లాదేశ్ ,కింద శ్రీలంక, పైన నేపాల్ ,ఇప్పుడు స్వతంత్ర దేశాలు.అవి భారత్ లో అంతర్భాగాలు కాదు.అయ్యే అవకాశము లేదు.ఇప్పుడు మన పాలకులు చేయాల్సిందల్లా ఇరుగుపొరుగు దేశాలతో మంచి స్నేహ సంబంధాలు కాపాడుకోవడం.ఉన్నదాంట్లో గౌరవముగా, తలమానికంగా బతకడం.దేశ ప్రజల్ని కూడా తలెత్తుకుని సగర్వంగా బ్రతికే టు చేయడం.ఇప్పటి యువతరానికి రాబోయే తరాలకు తప్పుడు సమాచారం ఇచ్చినవారు చరిత్రహీనులు అవుతారు.ఎంత దాసిన ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన సత్యం దాగదు.చరిత్ర మరుగున పడదు.మరుగున పడదామని ప్రయత్నించిన వారే.మందబుద్ధి అవుతున్నారు. మరుగున పడిపోతారు.ఎంతటి నియమితులైన సరే కాలం వారిని నిర్ధాక్షిణ్యంగా అట్టడుగున పడేస్తుంది.
హిందూ, హిందూ- అని పూనకం పూణే వాళ్ళను చూస్తే జాలి కలుగుతుంది.ఎందుకంటే ,అదే ఒక మతానికి చెందిన పదం కాదు.ఆ పదం ఎలా వాడుకలోకి వచ్చిందో తెలుసుకుంటే భ్రమలు తొలగిపోతాయి.మనది మొదటి నుండి సంపన్న దేశం.అందువల్ల ముస్లింలు, బ్రిటిష్ వారు మాత్రమే కాదు.గ్రీకు, డచ్, ఫ్రెంచి, ఫోర్స్ గ్రీస్, వంటి వారు ఎంతోమంది ఈ దేశంలో సొర పడ్డారు. ఇక్కడ భారతీయ మూలవాసులు ఇతరులపై దండెత్తిన దాఖలాలులేవు.ముస్లిములు ఈ దేశం తమది అనుకున్నారు .సొంతం చేసుకున్నారు.ఇతరుల కొల్లగొట్టి దోచుకుని వెళ్లిపోవాలని అనుకోలేదు.మొదటిసారి పొరుగువారు మన దేశానికి సింధూ నది దాటి వచ్చారు.వారికి స అక్షరం పలకడం రాదు. ను ,ారు, హ ,గా పలికారు.సింధూ నదిని- హిందూ నది అన్నారు.హిందూ నది ఉన్న దేశం కాబట్టి ఇ దీన్ని హిందుస్థాన్ అని అన్నారు.అంతే హిందూ అనే పదానికి ఏ మతం తోను ఏ శాస్త్రం తోను. ఏ ధర్మంతో ను, సంబంధం లేదు.సింధు (హిందూ) నది ఉన్న దేశం కాబట్టి, హిందూ దేశం అయ్యింది.ఈ విషయం వేద పండితులు చెప్పారు.చరిత్రకారులు చెప్పారు.ఆ హిందూ అనే పదం ఏ మత గ్రంథాలు లేదు.అందుకే కవి ఇక్బాల్ అన్నాడు .హిందీ హైహం-వతన్ హై హిందుస్థాన్ హమారా" అని!హిందూ అనే పదానికి తర్వాత కాలంలో మతం రంగు పులిమి ,దానికొక మతపరమైన పదముగా మార్చారు. భారతదేశంలో ఉన్నవారంతా భారతీయులైనట్లే- హిందూ దేశంలో ఉన్నవారంతా హిందువులే. కానీ ఆ పదాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి, ఇప్పుడు మనం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. పదాలు వాడకాన్ని బట్టి అర్థాలు మారిపోతాయి. కంపు అంటే అసలు ఒకప్పుడు మంచి వాసన, సుగంధం అని అర్థం ఉండేది ఇప్పుడు అర్థం మారిపోయింది. కదా? బెంగాలీలు, ఒరియా వారు 'వ' పలకరు. దాన్ని' బ' గ' పలుకుతారు .మనం రవీంద్ర అ అంటే వారు రబింద్ర అంటారు. ఈ తేడాలు మనం గమనిస్తున్న వే. 'స 'పలకలేని పర్షియా వాడు' హ' అంటే, మనం దానిని అర్థం చేసుకోవాలి కదా? ముస్లిం పాలకులు ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిరాఘాటంగా పాలించారు. ఇక్కడి వాటితో వారు ప్రభావితులయ్యారు. అలాగే వారి సంగీత సాహిత్యంతో ఇక్కడ వారిని ప్రభావితం చేశారు. భారతీయ తాత్విక చింతనతో ప్రభావితులైన ముస్లిం సూఫీ కవులున్నారు. కొందరు ఉపనిషత్తుల్ని అనువదించారు .ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ధ్వంసం చేయలేదని కాదు . ఇక్కడ కట్టడాల్ని లేదని కాదు. కానీ ఇక్కడ మతాల్ని భాషా సంస్కృతుల్ని, ఆచార వ్యవహారాల్ని దెబ్బతీయకుండా కొనసాగవలసిందే ఎక్కువగా ఉంది .వారి పరిపాలన సాగుతున్న కాలంలోనే కబీర్, సోదరులతో పాటు, చైతన్య ప్రభువు, జయదేవుడు, మీరలాంటి వారు కూడా మన గలిగారు. ఆదిశంకరుని అద్వైతం గానీ, రామానుజుని విశిస్టాదైవత్వం గానీ, వారి పరిపాలన కాలంలో వర్ధిల్లాలి అన్నది మరువకూడదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ దేశంలో ఒక మిశ్రమ సంస్కృతి అవతరించింది. మిశ్రమ సంస్కృతి అయినా కూడా, సోదర భావంతో ఐకమత్యంగా జీవించడమే ఈ దేశపు ప్రత్యేకత! గొప్పదనం!" ఈ దేశం నాది. నేను భారతీయుణ్ణి" అనే భావం ప్రతి ఒక్కరిలో ఉంది. అదే భావం వేల ఏళ్లుగా కొనసాగుతూనే వుంది. ఇప్పుడు ఈ దేశ పాలకులు పౌరసత్వ సవరణ చట్టం అంతేగాని అదే భావంతో మళ్లీ దేశమంతా ఒకే గొంతుతో వ్యతిరేకిస్తున్న సంగతి మన కళ్ళ ముందే దొరుకుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. వేద పండితుడు, రచయిత అయినా దాశరథి రంగాచార్య ఆదిశంకరుని అద్వైతం గురించి ఒక్క మాట చెప్పారు. ఇస్లాం మత ప్రభావంతోనే ఆదిశంకరుని అద్వైతం గురించి ఒక మాట చెప్పారు ఇస్లాం మతం ప్రభావంతోనే ఆదిశంకరుని అద్వైతం అవిర్భవించిదన్నారు. సంకుచిత మనస్కులు ఇలాంటి విషయాలను అంగీకరించలేరు. మొగల్ చక్రవర్తి అక్బర్ మన ప్రాణాల్ని ఉర్దూ లోకి అనువదింప చేసుకున్నారని చరిత్ర చెబుతుంది.
ఇదంతా గతం. అయితే చదువు సంస్కారం లేని వారికి ఈ విషయాలు బోధపడవు. మోసపూరితంగా అధికారంలోకి వచ్చి, అబద్దాలు ప్రచారం చేస్తూ జనాన్ని మోసం చేసేవారి ఆటలు ఎల్లకాలం సాగవు. ఆ మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? చీపురు గుర్తు- స్వచ్ఛభారత్ చేసేసింది. క్రేజీవాల్ టెర్రరిస్ట్ అన్నారు. అతనికి పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రధాని, హోంమంత్రి తమ స్థాయిని మరిచి దిగజారుడు ప్రచారాలు చేశారు. ఢిల్లీ ఓటర్లు తెలివిగా ప్రవర్తించారు. తమకు పని చేసే ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అంతే! అసలు భారత్ రాజకీయాల్లోనే క్రేజీవాల్ ఒక కొత్త ఒరవడిని ప్రారంభించారు. పనిచేసి ఓట్లు అడిగాడు. దొంగ మాటలు చెప్పడమో, డబ్బులు పంచడమే కాకుండా ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెరలేపారు. ఇది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రఖ్యాత సైన్స్ రచయిత ఇసాక్ అసిమోవ్ ఓ మాట చెప్పారు. మూర్ఖత్వమే దేశభక్తి గా చలామణి అవుతున్న తోట వివేకవంతుడు గా ఉండడం చాలా ప్రమాదం" అని! దేశ ప్రగతికి పాటుపడడం దేశభక్తి అని, ప్రజాసమస్యలు పరిష్కరించడమే దేశభక్తి అని ఢిల్లీ ముఖ్యమంత్రి కొత్త నిర్వచనాలు ఇచ్చారు. ఇది ఇలా సాగుతూ ఉంటే, తమ తమ రాజకీయ పార్టీలలో నేర చరితులు ఎంతమంది ఉన్నారో, వారి మీద ఎలాంటి కేసులు ఉన్నాయో వెంటనే తెలియజేయాలని సుప్రీంకోర్టు అడిగింది. కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థని చేయాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. కిందిస్థాయి వాళ్లను పక్కన పెట్టి కేవలం పార్లమెంటు సభ్యులు విషయమే చూస్తే- అత్యధికంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నవారిని ఎక్కువమంది నేరగాళ్లు ఉన్నారు. ఆ పార్టీ వారి మీద చర్యలు తీసుకుంటుందా? ఊరికే ప్రకటిస్తే ఏం లాభం.' పొగ తాగడం హానికరం' అనే సిగరెట్ డబ్బా ల మీద హెచ్చరిక ముద్రిస్తే ఏం లాభం? తాగే వారు ఆపేస్తున్నారా? ఇది అలాగే అవుతుందేమో బహుశా--
ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగర్ మైనర్ బాలికపై లైంగిక దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. విచారణ ఎదుర్కొన్నాడు. కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన స్వామి చిన్మయానంద్, న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. అమ్మాయి చదివే కాలేజీకి అతను డైరెక్టర్ అయి ఉండి ఆ పని చేశాడు. అతని వల్ల తనకు ప్రాణభయం ఉందని ఆ అమ్మాయి షాజహాన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇకనేం చిన్మయానంద ఆమెను కిడ్నాప్ చేసి చేయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే అవుతుంది. అసలు వారి ఆలోచనా విధానం ఎలా ఉందో చూడాలనుకుంటే, వారు ఎవరిని జాతిపితగా, ఎవరిని జాతిపితగా, ఎవరిని జాతి రక్షక్ గా గుర్తుంచుకుంటున్నారో గమనించాలి . జాతిపిత అంటే వారి దృష్టిలో వినాయక్ దామోదర్ సావర్కర్! గాంధీ హత్య కేసులో తృటిలో శిక్ష నుండీ తప్పించుకున్న వాడు. అలాగే జాతీహిత అంటే నాథురం గాడ్సే, గాంధీజీని హత్య చేసిన వాడు. ఇక దేశద్రోహి ఎవరు? అని అడిగితే ఆర్ ఎస్ ఎస్- బిజెపి వర్గాలన్నీ ముక్తకంఠంతో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అనే సమాధానం చెబుతాయి. ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరంలో పదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. దేశంలో వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన శాలలు ప్రాజెక్టులు ప్రారంభించాడు. అందుకే ప్రపంచం ఆయనను ఆధునిక భారతదేశ నిర్మాతగా గుర్తించింది.
ఆకారణంగానే ఆయనను వీరు జాతి ద్రోహిగా చిత్రిస్తున్నారు. ఇదే విషయం మీద ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు 8 సెప్టెంబర్ 1962 నాటి సంపాదకీయంలో ఇలా రాశారు. "నెహ్రూ తనకు శత్రువు- అనే వ్యక్తి భారత ప్రజాస్వామ్యానికి శత్రువు. ధర్మానికి శత్రువు. సమత సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా గల నవ సమాజ నిర్మాణం లక్ష్యానికి శత్రువు. ప్రగతికి శత్రువు. భవిష్యత్తు కె శత్రువు" అని! నేటి పాలకులకు ఈ విషయం అర్థం అవుతుందా?
మరోవైపు లక్షల కోట్ల దేశ సంపదను దూసుకుపోయిన వారిని దేశ సరిహద్దులు దాటించిన మన చౌకీదార్ ని మాత్రం జాతి రక్షక్ గా అభివవర్ణించుకుంటున్నారు. కార్పొరేట్ మిత్ర, రాజ్యాంగ విధ్వాంసక, గుజరాత్ నరమేధం కిరీటి, ద్వేషం ప్రసంగి లాంటి ఎన్ని బిరుదులైన మన ఈ జాతి రక్షక్ కు సరిపోవు. ఎత్తైన విగ్రహాలు తయారు చేయించే దేశంగా ఆయన మన దేశాన్ని నిలబెట్టారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెలైన్ బాటిల్స్ లేకుండా, డా అవి తగిలించే స్టాండ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలోనే సామాన్యుల్ని మల మల మాడుస్తూ- గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో దేశాన్ని అడుగడుగున నిలపడానికి కృషి చేస్తున్నారు. ఇంత చేసి దేశాన్ని ఎప్పుడెప్పుడు అఖండ హిందూ రాజ్యం చేద్దామా? అని ముంగేరి లాల్ లాగా కలలు కంటున్నారు....
ఈ వ్యాసం.
దేశములో- గౌరవనయులైన- మూర్ఖులు- అనే పుస్తకం నుండి?
రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత.
Comments
Post a Comment