హ్యాపీ బర్త్డే డాడ్
పుట్టింది: August 10, 1929
1945 లో తన తండ్రి ఒక బట్టల దుకాణములో రోజువారి కూలిగా పెడితే చదువుకునేందుకు ఇంటి నుంచి పోయి టికెట్ కోననీకె టికెట్ కోననీకె పైసలు లేని పరిస్థితుల్లో ట్రైన్ ఎక్కి అమృతసర్ చేరుకున్నరు.
బతకడం కోసం ఆ అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌లో బూట్లు పాలిష్ చేస్తూ అక్కడి హిందూ కాలేజీ లో చేరిండ్రు.
1949: లో లా చదివేందుకు మళ్ళా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిండు
1974: 1971 నుంచి ఆయన పేరును ప్రతిపాదించగా 1974 లో హైకోర్టు న్యాయమూర్తి గా అప్పోయింట్ అయ్యినరు. అగ్రకుల ఆధిపత్య కుట్రల వలన తన సీనియారిటీని పోగొట్టుకున్నారు.
1975:లో న్యాయవ్యవస్థలో కుల ఆధిపత్యం చూసి వశం గాక భారత దేశములో రాజీనామా చేసిన మొట్ట మొదటి న్యాయమూర్తి అయ్యినరు.
1977: కాన్స్టిట్యూషనల్ (రాజ్యాంగ) లా (చట్టం) లో అథారిటీ అని పేరు సంపాదించుకున్న శివ శంకర్ గారిని, శ్రీమతి ఇందిరా గాంధీ గారు తన న్యాయపోరాటానిలో సాయం చేయాలని శివ శంకర్ గారిని కోరిగా ఆయన ఆమె లాయర్ గా చేరి ఆమె తరపున వాదించి కేసులు అన్ని గెలిచారు.
1980: ఆమె కృతజ్ఞతతో ఆయనను తన కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారు.
1980 - 1989:లో ప్రధాని తర్వాత దేశంలో 2వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
న్యాయ ఇంధన (పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, బొగ్గు గనులు) వాణిజ్యం విదేశాంగ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లానింగ్ శాఖల కు మంత్రిగా ఉన్నారు
1988 - 1991: లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
1994 - 96: లో సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా పని జేసిండు
బలహీన వర్గాల కోసము:
1952 - 1971:లో వెనుకబడిన తరగతుల (BC) జాబితా తయారీ కోసం బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డిలతో నిరంతరం పొట్లాడారు, హై కోర్టులో ఎన్నో కేసులు వేశారు.
ప్రతిసారి అధిపత్య కులాల ముఖ్యమంత్రి లేక జడ్జీ ఉండడము వలన ఆయన పోట్లాటలు సఫలీకృతము కాలేదు
1971:లో వెనుకబడిన తరగతుల జాబితాపై సుప్రీం కోర్టులో కేసు వేసి గెలిచారు. తర్వాత, ఆ జాబితా ఆమోదించబడింది.
1980 - 1989:
ప్రధాన న్యాయమూర్తి తరుపున వ్యతిరేకత ఉన్నా గూడా, సుప్రీంకోర్టులో మొదటి సారిగా SC మరియు బీసీ న్యాయమూర్తులను నియమింప చేశారు.
'ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తుల బదిలీ' జేసే చట్టం తీసుకురావడం ద్వారా అప్పటిదాకా హైకోర్టులలో నడుస్తున్న కుల ఆధిపత్యాన్ని నిర్మూలించి ఒక కొత్త చరిత్రకు తొవ్వ ఏశాడు
కూలీ నాలి చేసుకునే బతికే పేదలందరికీ ‘ఉచిత న్యాయ సహాయం’ ఇయ్యాలనే చట్టాన్ని తీసుకొచ్చారు.
శ్రీ కెజి బాలకృష్ణన్ ను చాలా చిన్న వయస్సులోనే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. దీంతో SC కమ్యూనిటీ కి చెందిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. అలాగే ఆ కోర్టులో ఎక్కువ కాలం పనిచేసిన 2వ ప్రధాన న్యాయమూర్తిగా కూడా నిలిచారు.
దేశంలోని వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా బీసీన్యాయమూర్తులను నియమించారు.
శ్రీ B P మండల్ గారి అభ్యర్థన మేరకు, మండల్ కమిషన్ పనిని పూర్తి చేయడానికి దాన్ని రెండుసార్లు పొడిగించారు.
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వీపీ సింగ్‌కు సూచించారు. ఈ విషయాన్నీ స్వయంగా వీపీ సింగ్ గారే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ శివ శంకర్ గారిని అభినందించారు.
శ్రీ VP సింగ్ గారి కోరికపై మండల్ కమిషన్ సిఫార్సులను శివశంకర్ గారే డ్రాఫ్టుగా రూపొందించారు.
శివ శంకర్ గారు బలహీన వర్గాలకి చేసినవి ఇంకా చాలా ఉన్నాయి, అవి ఆయన జీవిత చరిత్ర పుస్తకములో ఉన్నాయి.
బలహీన వర్గాల అభివృద్ధి కోసము కొంచమైనా మీ అడుగు జాడలల్లో నడుద్దామని ఆశిస్తూ - Dr వినయ్
Comments
Post a Comment