ఎవరు బహుజనులు? ఎవరు మనువాదులు?
పాము రవీంద్రనాథ్
బహుజనులు ఎవరనగా! భారత దేశ రాజ్యాంగాన్ని అందు లోని శాసనాలని గౌరవిస్తూ సంఘంలోని సభ్యులందరినీ సమానంగా గౌరవించేవారు కుల, మత, లింగ, వర్ణ, వర్గ, ప్రాంత, బేధాలు లేకుండా అందరి సంక్షేమం కోసం సోదరుభావంతో ఎవరికీ హాని తలపెట్టకూండా జీవించే వారే బహుజనులు మానవులకు జీవరాశి కి కావలసిన ఆహారం! సకల సౌకర్యాలు అన్నీ ఉత్పత్తి చేసేది ఈ బహుజనులే!
మనువాదులు ఎవరనగా! భారత దేశ రాజ్యాంగాన్ని అందు లోని శాసనాలని గౌరవించకూండా మనుస్మృతి లోని చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా నిచ్చెన మెట్ల వ్యవస్థ లోని సూత్రాలను పాటిస్తూ సంఘంలోని సభ్యులందరినీ కుల, మత, లింగ, వర్ణ, వర్గ, ప్రాంత, బేధాలతో నిరంతరం కలహాలు రేపి అలజడులు, అల్లర్లు సృష్టిస్తూ! కొందరి సంక్షేమం కోసం అహంకార భావంతో మూడ విశ్వాసాలతో చెమట చుక్క చిందించ కూండా ఒక్క వడ్ల గింజ కానీ, ఒక్క గోధుమ గింజ కానీ, ఒక్క ప్రత్తి పువ్వును కానీ, ఒక్క చీరను కానీ, ఒక్క పంచెను కానీ, ఒక్క పలకను కానీ, ఒక్క పెన్నును కానీ, ఒక్క సైకిల్ కానీ, ఒక్క మోటార్ వాహనం కానీ, ఉత్పత్తి లో ఏమాత్రం పాలిబాగం లేకుండా శ్రమ జీవులైన బహుజనులు ఉత్పత్తి చేసిన సంపదనంతా దోచుకు తింటూ తిరిగి బహుజనులను నీచులు, చండాలులు, దరిద్రులు, సంస్కారహీనులు అని బహుజనులపై బహుజనులతోనే దాడులు చేయిస్తూ(ఇక్కడ కూడా వాళ్ళ శ్రమ లేదు) సమాజం లో సంఘం లో శాంతి లేకుండా నిరంతరం వాళ్ళ స్వార్ధ లోభం తో(లాభం అంటే ఆశ లోభం అంటే అత్యాశ) బహుజనులను హింసలకు గురిచేస్తూ నిరంతరం బహుజనులకు హాని తలపెట్టు కూంటూ జీవించే వారే మనువాదులు!
ఈ బహుజన వాదం కు! మనువాదం కు! తేడా తెలియక! శతృవు ఎవరో మిత్రులు ఎవరో తెలియ కుండా పోరాటం చేసేవారి కోసం ఈ సమాచారం ఇవ్వాలనిపించింది.
భారత మూల వాసులు ఇది చదివిన తరువాత అయినా భారత సామాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కు మందును కనుగొంటారని ఆశిస్తూ !!!!
బహుజనుల నినాదం జై భీమ్!!!
మనువాదుల విధానం మీకు తెలుసు నేను చెప్పనవసరం లేదు తెలియని వారికి క్లూ ఇస్తా(కథే దాని ఆధారంగా) అతనికి అనుమానం ఎక్కువ ఆ అనుమానం తో గర్భ వతి అయిన భార్యను అడవి లో వదిలివేసాడు!
మీ సహోదరుడు
పాము రవీంద్రనాథ్.
Comments
Post a Comment