Skip to main content

రాబోయే ఎలక్షన్ లో మళ్లీ దొరల నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలన వస్తే ఇంకేం మిగలదు

తెలంగాణలో ఉన్న మేధావులారా,కవులారా, కళాకారులారా, విద్యార్థులారా ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం  కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. రాబోయే ఎలక్షన్ లో మళ్లీ దొరల నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలన వస్తే ఇంకేం మిగలదు ఇక నిజాం రోజులు అనుభవించాల్సిందే. ఇప్పుడు అన్ని పార్టీలు ఆధిపత్య వర్గాల నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం 92 శాతం ప్రజలు ఉన్నారు .వారి ఓట్లతోఅధికారంలోకి రావాలని చాలా తెలివిగా ఎక్కడ కిందివర్గాల నాయకత్వాన్ని ఎదగకుండా అణగదొక్కి అధికారంలోనికి రావాలని ఎదురు చూస్తున్నాయి అన్ని పార్టీలు.ఇప్పటివరకు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకున్న రెడ్ల నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ పరిపాలనను చూసాం.అదేవిధంగా మండల కమిషన్ రిజర్వేషన్ వల్ల ఎదిగి వచ్చిన మధ్యతరగతి నాయకత్వాన్ని అణగదొక్కుతూ తెలుగువారి ఆత్మగౌరవం పేరుమీద నిర్మితమైన కమ్మవారి నాయకత్వానతెలుగుదేశం పార్టీ పరిపాలనను అనుభవించాం. బ్రాహ్మణులభావాజాలంతోకొనసాగుతున్న బిజెపి పార్టీ పక్క రాష్ట్రాలలో పరిపాలనను అదేవిధంగాకేంద్రంలో పరిపాలనను చూస్తూ ఉన్నాం వారు చేసేటటువంటి పరిపాలన విధానాలను అనుభవిస్తూ ఉన్నాం.పసి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు జై తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ అంటూనే పక్తు రాజకీయ పార్టీగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని బ్రష్టుపట్టించి పరిపాలనను గాలికి వదిలేసి జిల్లాల పునర్విభజన పేరుమీద పార్టీని బలోపేతం చేసుకుని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద వ్యాపారవేతలకు అప్పగించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రమని ప్రగల్బాలు పలుకుతూ ప్రజలను బంగారు తెలంగాణ అని భ్రమలల్ల నిండా ముంచి ప్రతి కార్యక్రమాన్ని ఆర్భాటం చేసి ఆరంభించి అంతం చేసి అన్ని పైసలు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిండా ముంచి భారాన్ని తీర్చడానికి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి రోడ్లమీద బండ్లు కనిపిస్తే చాలు పైసలు వేస్తాం లేకుంటే జీతాలు ఇవ్వలేం అనే దుస్థితికి రాష్ట్రం అభివృద్ధి చెందింది. అదేవిధంగా ప్రతి పల్లెలో లెక్కలేనన్ని వైన్ షాపులు పెట్టి ఎదుగుతున్న యువతను మద్యానికి బానిసలను చేసి వారి జీవితాలను నాశనం చేస్తూ,  చదువుకున్న యువతను నిరుద్యోగులను ఈరోజు రేపు త్వరలో ఉద్యోగ  నోటిఫికేషన్ అని ఊరించి ఎలక్షన్ సంవత్సరం రాగానే పట్టుమని 80,000 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా డబ్బాకోట్టుకొని నోటిఫికేషన్స్ ఇచ్చి వచ్చే ఎలక్షన్లలో డబ్బులతో ప్రజల నుంచి ఓట్లు కొనడానికి ప్రశ్న పత్రాలను అమ్ముకొని రాష్ట్రంలో ఉన్న 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మీరు ఎలక్షన్ల గురించి ఆలోచించకండి కుర్చోని చదువు కొండీ ప్రశ్నిస్తే తీన్మార్ మల్లన్న లాగా మీమ్మల్ని కూడా జైలులో వేస్తాం అని భయపెడుతూ. రాష్ట్రంలో నిరుద్యోగం మొత్తం నిర్మూలించినంమళ్లీ ఓట్లు వేయండి మేము మిమ్మల్ని పరిపాలిస్తాం. అంటున్నారు ఉద్యమంపేరు మీద పుట్టిన దోంగ నాయకులంతా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి. మేము ఉన్న కాడికి అంతా దోచుకుంటాం మిమ్మల్ని బానిసలుగా చేస్తాం అనుకుంటున్నరు పాలకులు ఇట్లఅంటూనే 10% కూడా సరిగ్గా జనాభా లేని అగ్రవర్ణాలల్లో ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుపరచడానికీ బలహీన వర్గాలను మరింత ఆర్థికంగా రాజకీయంగా బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఏమి ఎరుగనట్టు నటిస్తూ1200 మంది విద్యార్థీఅమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు దోచుకొని దాచుకున్న ప్రజాసోమ్ము గురించి ఈడి విచారణకు ఆదేశిస్తే తెలంగాణ అంతా ఆగమైపోయినట్లు వారి దృష్టి మళ్లించేందుకు అల్లుడు ప్రెస్ మీట్ పెట్టి రెండో విడత గొర్ల పంపిణీ చేస్తాం, ఖాళీగా ఉన్న వాళ్లకు ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇస్తాం ,పోడు భూములకు పట్టాలిస్తాం, దళిత బంధు పథకం ఇస్తాం, 58 59 జీవోలను ప్రభుత్వ జాగాలలో ఇల్లు కట్టుకోవడానికి, కాశీ, శబరిమల లో వసతి గృహాలు ఏర్పాటు కల్పిస్తాం అంటుంటే కొడుకేమో ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమ సమయంలో ప్రజల ఆధారణను చురగొన్న కెసిఆర్ మెచ్చుకున్న ఛానల్, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే ఛానల్,ఎల్లప్పుడూ ప్రజల వైపు నిలబడేఛానల్ అవినీతిలో కూరుకుపోయిన కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టినందుకు  వి6 చానల్ నుబ్యాన్ చేస్తాం, పేపర్ల లీకేజీ అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది . Tspsc రాజ్యాంగ బద్ధమైన సంస్థ మాకేం సంబంధం  అని మంత్రి వర్గంలో ఉన్న సోయిమరిచి అంటుంటే ఇక కవితమ్మ ఏమి ఎరగనట్టు ఢిల్లీ పోయి 33% మహిళలకు రిజర్వేషన్లు కావలని దీక్ష చేపట్టింది. మరి తెలంగాణ లో మొదటిసారి అధికారంలోకి వచ్చినంక ఒక్క మహిళా మినిస్టర్ ను కూడా ఎందుకు చేయలేదు. రాజకీయా మరియు నామినేటెడ్ పదవులలోమహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారో తెలవదా ,30 సంవత్సరాల నుంచి గుర్తుకు రానీమహిళ రిజర్వేషన్, ఎంపీ పదవిలో కొనసాగుతున్నప్పుడు గుర్తుకు రాని చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ ఈడి నోటీసులుఅనంగానేఇప్పటికిప్పుడు గుర్తుకొచ్చిందా. అంటే ఇది కేవలం తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని మల్లించడానికీ ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదు ప్రజల నుంచి కష్టపడి దోచుకున్న దొంగతనం బయటపడితే రాబోయే ఎలక్షన్లో మాకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అని ఆలోచించి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర లేకుంటే వీళ్ళు అంత పుట్పాతులపైన బతికేటోల్లు కాదా ఓక సారీ ఆలోచించండి.అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులారా కళాకారులారా రచయితలారా సబ్బండ వర్గాల ప్రజలారా ముఖ్యంగా విద్యార్థులారా ఆలోచించండి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పేదరికం పోలే నిరుద్యోగ నిర్మూలన జరగలే ప్రజలందరికీ ఇండ్లు రాలే మూడు పూటలా తిండి దొరకలే భూ పంపిణీ అందరికీ జరగలే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ సమానంగా అందలేదు. దీనికంతటికి మూల కారణం రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణ నాయకత్వంలో కొనసాగడమే కాబట్టి ఇకనైనా మీరంతా మేల్కోని ప్రజాస్వామ్య పరిపాలనను అందించడం కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అందరికీ సమానంగా అందించడం కోసం విద్య వైద్యం సత్వర న్యాయం అనే నినాదంతో, మూలవాసి సిద్ధాంతంతో జనాభా దామాషా ప్రకారం వారి అవకాశాలను వారికి కల్పిస్తూ, అమరవీరుల ఆశయాలను నెరవేర్చడం కోసం మేధావుల కళలను నిజం చేయడం కోసం, నిరుద్యోగుల జీవితాలను నిలబెట్టడం కోసం ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మించడం కోసం,ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ సాధన అనే అంశాన్ని లక్ష్యంగా ఎంచుకొని ప్రజా పార్టీ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారి నాయకత్వాన తెలంగాణలోని ప్రతి పల్లెకు ప్రతి గడపకు ప్రతి గుడిసెకు వస్తున్నది కాబట్టి మీరు చేయవలసిందల్ల అన్ని పార్టీల జెండాలను మూటగట్టి నేలకేసి కొట్టి ప్రజా పార్టీ జెండాను చేతబట్టి ఆదరించండి ప్రచారం చేయండి కార్యకర్తలుగా, నాయకులుగా పరిపాలకులుగా ఎదగండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని కల్పించండి. ఒక్కవిషయం గుర్తించుకోండి విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం- కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం గెలిస్తే మనం అనుకున్న సమాజాన్ని నిర్మిస్తాం.కాబట్టి అందరం కలిసి రాజ్యాంగంలో కల్పించిన హక్కులను,ప్రజాస్వామ్య పరమైన పరిపాలనను సాధించుకుందాం.

జై ప్రజాపార్టీ.          జై జై ప్రజాపార్టీ

దాసరి అజయ్ కుమార్ యాదవ్,
ప్రజాపార్టీ అధ్యక్షులు, తెలంగాణరాష్ట్రం.
9494019085.

Comments

Popular posts from this blog

Helen Mirren once said: Before you argue with someone, ask yourself.......

Helen Mirren once said: Before you argue with someone, ask yourself, is that person even mentally mature enough to grasp the concept of a different perspective. Because if not, there's absolutely no point. Not every argument is worth your energy. Sometimes, no matter how clearly you express yourself, the other person isn’t listening to understand—they’re listening to react. They’re stuck in their own perspective, unwilling to consider another viewpoint, and engaging with them only drains you. There’s a difference between a healthy discussion and a pointless debate. A conversation with someone who is open-minded, who values growth and understanding, can be enlightening—even if you don’t agree. But trying to reason with someone who refuses to see beyond their own beliefs? That’s like talking to a wall. No matter how much logic or truth you present, they will twist, deflect, or dismiss your words, not because you’re wrong, but because they’re unwilling to see another side. Maturity is...

The battle against caste: Phule and Periyar's indomitable legacy

In the annals of India's social reform, two luminaries stand preeminent: Jotirao Phule and E.V. Ramasamy, colloquially known as Periyar. Their endeavours, ensconced in the 19th and 20th centuries, continue to sculpt the contemporary struggle against the entrenched caste system. Phule's educational renaissance Phule, born in 1827, was an intellectual vanguard who perceived education as the ultimate equaliser. He inaugurated the inaugural school for girls from lower castes in Pune, subverting the Brahminical hegemony that had long monopolized erudition. His Satyashodhak Samaj endeavoured to obliterate caste hierarchies through radical social reform. His magnum opus, "Gulamgiri" (Slavery), delineated poignant parallels between India's caste system and the subjugation of African-Americans, igniting a discourse on caste as an apparatus of servitude. Periyar's rationalist odyssey Periyar, born in 1879, assumed the mantle of social reform through the Dravidian moveme...

India needs a Second National Capital

Metta Ramarao, IRS (VRS) India needs a Second National Capital till a green field New National Capital is built in the geographical centre of India. Dr B R Ambedkar in his book "Thoughts on Linguistic States" published in 1955 has written a full Chaper on "Second Capital for India" While discussing at length justfying the need to go for a second capital has clearly preferred Hyderabad over Kolkata and Mumbai. He did not consider Nagpur. Main reason he brought out in his book is the need to bridge north and south of the country. He recommended Hyderabad as second capital of India. Why we should consider Dr Ambedkar's recommendation: Delhi was central to British India. After partition, Delhi is situated at one corner of India. People from South find it daunting to visit due to distance, weather, language, culture, etc. If Hyderabad is made second capital, it will embrace all southern states. People of South India can come for work easily. Further, if Supreme Court...