మూసీనది ప్రక్షాళ నకై పోరాడుదాం కలిసి రండి
- హైదరాబాద్ నగర ప్రజలకు ఆకునూరి మురళి పిలుపు
- నల్లకుంట చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర
- రేపు లిబర్టీ నుండి లకడికపూల్ వరకు పాదయాత్ర
మూసీ నది ప్రక్షాళన కొరకై పోరాడేందుకు హైదరాబాద్ మహా నగర ప్రజలు కలిసిరావాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం Society For Earth Justice (SoEJ) ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళన కోసం క్వారంటీ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళన పై అనేక హామీలను, ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి థెమ్స్ నది గా మారుస్తామన్నారు. కానీ నేటి వరకు ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన అంశం ను విస్మరించారంన్నారు. ఘట్కేసర్ ఎంపీపీ, ఎంపీపీ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంలో విఫలమైన నేపథ్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ లోని అతి పవిత్రమైన మూసి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని మూసి నదికి పేరుకు మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ కేటాయించారు వేలకేట్లు నిధులు మంజూరు చేశామని అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మూసి పరిసర ప్రాంతాల్లో 20 లక్షల నుంచి 30 లక్షల ప్రజలు నివసిస్తున్నారని, భూ కాలుష్యం, వాయి కాలుష్యం కావడంతో ప్రజల అనారోగ్యన పడి సమస్య ఏర్పడిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎంతో చరిత్ర కలిగిన మూసి నదిని కాపాడాలని ఆయన కోరారు. మూసీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక కన్వీనర్ పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ మూసీలోకి హైదరాబాద్ నగర ప్రజల వ్యర్థాలతో పాటు మెడికల్, రసాయన పరిశ్రమల వ్యర్థాలు యథేచ్ఛగా వదలడం వలన సూపర్ బగ్ దశలోకి వెళ్లిందని, ధీంతో మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూసీ ప్రక్షాళన కు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ వెంకటదాసు మాట్లాడుతూ మూసీనదిని, హైదరాబాద్ మహానగర పరిసరాలలోని చెరువులను ప్రక్షాళన చేస్తే మనం దోమకాటు, విషవాయువుల నుండి రక్షించ బడతామన్నారు. మూసీ నీళ్ళతో పండిన కూరగాయలు వరిలాంటి ధాన్యాలలో హానికరమైన అవశేషాలు ఉన్నాయన్నారు. .
Comments
Post a Comment