Skip to main content

కమ్యూనిస్టులకు టిఆర్ఎస్ కు పొత్తు కుదురుతుందా?

కమ్యూనిస్టులకు టిఆర్ఎస్ కు పొత్తు కుదురుతుందా? కోదండరాం టీజేఎస్ వారికి ,కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ బిజెపిలో కొనసాగుతారా? ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలిద్దాం . 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి సిపిఐ, సిపిఎం నాయకులు కేసిఆర్ తో చర్చించాలని అభిలాషిస్తున్నారు కానీ కెసిఆర్ వారితో చర్చించడం లేదని చర్చలకు పిలవడం లేదని సమాచారం. కనీసం ఈసారైనా ముందే సీట్ల సర్దుబాటు జరిగితే ఇప్పటినుండి ఎన్నికల కోసం సన్నద్ధం కావచ్చని కమ్యూనిస్టుల భావన .కెసిఆర్ ఎందుకని కమ్యూనిస్టులతో చర్చించడానికి ఆసక్తి చూపడం లేదు. కారణాలు స్పష్టం. కేసిఆర్ కు అమీత్ షాకు మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కొందరు బిజెపి నాయకులు కూడా లేవనెత్తారు. కవితను సి.బి.ఐ అరెస్టు చేయకపోతే బిజెపికి కెసిఆర్ కు మధ్య చీకటి ఒప్పందం ఉందని ప్రజలు భావిస్తారని  కొందరు బిజెపి నాయకులు సైతం వారి అధిష్టానానికి తెలియజేశారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కెసిఆర్ కు బిజెపి అగ్రనాయకత్వానికి మధ్య ఏదో ఒప్పందం ఉందనేది స్పష్టం .అదిగాక వారిద్దరి భావజాలం ఒకటే .ఒకవైపు సెక్యులర్ వాడిననిచెప్పుకున్నా.ముస్లిం మైనారిటీలకు ఇస్తానన్న రిజర్వేషన్లు ఇవ్వకపోవడం ఇలాంటి రకరకాల విషయాల్లో కేసీఆర్ బిజెపి విధానాలతో ఆచరణలో ఏకీభవిస్తున్నాయని భావించవచ్చు. ఇక వర్గ ప్రయోజనాలకు వస్తే ఇద్దరు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను భూస్వాముల ప్రయోజనాలను కాపాడుతారు. మధ్యయుగాలనాటి భావాలను అనుసరిస్తారు. విదేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించడంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకు అప్పగించడంలో భూగర్భ ఖనిజాలను వ్యాపార ప్రయోజనాల నిమిత్తం కార్పొరేట్లకు అప్పగించడం లాంటి విషయాల్లో కేసీఆర్ బిజెపి విధానాల ఒకటే. అంతేకాక వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో దళారులను ప్రోత్సహించడం కవులు దారుల, వాస్తవంగా సాగు చేస్తున్న వారి ప్రయోజనాలను దెబ్బతీయడం  లాంటి విషయాల్లో బిజెపి కెసిఆర్ విధానాలు దాదాపు ఒకటి .అదేగాక ప్రయివేట్ విశ్వవిద్యాలయాలను స్థాపించడంలో ,విస్తరించడంలో  కూడా ఇరువురి విధానాలు ఒకటే .మైనార్టీల గురించి దళితుల గురించి ఆదివాసీల గురించి ఎన్ని వాగ్దానాలు చేసినా కెసిఆర్ వాస్తవంగా అమలుకు వచ్చేసరికి అందులో చాలా వరకు ఆమలుకు నోచుకోవు. హుజూర్ నగర్ లో  ఈటెల రాజేందర్ ను ఓడించడానికి దళిత బంధుపథకం  ఆ నియోజకవర్గంలో అమలు చేసినట్లు రాష్ట్రంలో మరెక్కడ అమలు చేయలేదు .దళిత బంధు డబుల్ బెడ్ రూములు శాంపుల్ గా ఇవ్వడం మినహా ఆర్హులందరికీ ఇవ్వాలనే ఆలోచన  గాని దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు గాని లేవు. కమిషన్ల కొరకు ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించినట్లు లక్షల కోట్ల రూపాయల్లో కనీసం కొంతయినా విద్యకు గాని వైద్యానికి గాని కేటాయించలేదు. ఇక జాతీయస్థాయిలో  జీఎస్టీ  బిల్లు వ్యవసాయ బిల్లులతో సహా దాదాపు బిజెపి ప్రవేశపెట్టిన అన్ని వివాస్పద బిల్లులకు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే బిజెపికి సంఖ్యాపరంగా అవసరమైనప్పుడల్లా టిఆర్ఎస్ ఎంపీలు బిజెపిని బలపరిచారు కాలేశ్వరం కేసీఆర్ ఎటిఎం అని బహిరంగ సభలో  విమర్శించడం తప్ప కేసీఆర్ కుటుంబం అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించడం తప్ప ఈ అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ జరపాలని బిజెపి నాయకత్వం  ఆలోచించ లేదు ఏ చర్యలు తీసుకోలేదు. ఎప్పుడో శాంపుల్ గా మల్లారెడ్డి లాంటివారిపై  ఇన్కం మ్ టాక్స్ వారు సోదాలు జరుపుతారు. తర్వాత అంతా మామూలే. కేసులు వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అవసరమైన కేసులు వేయరు .ఇక కవిత విషయానికి వస్తే ఆమెకు  వ్యతిరేకంగా ఎన్నో సాక్షదారాలుల ఉన్నాయని  ఆమె ఎన్నో సెల్ ఫోన్ల ను  ధ్వంసం చేసిందని సిపిఐ ఆరోపించినప్పటికీ, బిజెపిలో ప్రముఖంగా ఉన్న ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు డిమాండ్ చేసిన కూడా బిజెపి వారు కవితను సిబిఐ వారు అరెస్టు చేయకుండా చూస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.  కేసీఆర్ కుటుంబం విదేశాల్లో  ఆస్తులు దాచుకున్నదని, అవినీతిమయమని రాష్ట్ర బిజెపి నాయకులు గొంతు చించుకున్న ను కేంద్రంగా నేర పరిశోధిక సంస్థలు అటువైపు కన్నేత్తి చూడ్డం లేదు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి వస్తే ఆ విషయాన్ని ఇప్పుడే అటకెక్కించారు .అసలు ఎఫ్ ఐ, నుండి పంచనామాల తయారీ వరకు ఎసిబి వారిని పక్కనపెట్టి కనీసం పాటించవలసిన ప్రొసీజర్ పాటించకపోవడం టేప్ రికార్డులను కోర్టుకు సమర్పించకుండా కెసిఆర్ వాటిని ప్రెస్ రిలీజ్ చేయడం అంతా గొప్ప స్టేజి డ్రామా అని ఏమాత్రం క్రిమినల్ కేసుల  విచారణ పద్ధతి తెలిసిన వారైనా  భావించాల్సి ఉంటుంది. ఇక నిన్న మొన్న అమిత్ షా ను కలవడానికి కేటిఆర్ ఢిల్లీకి వెళ్ళాడు. మొదట సమయం ఇచ్చినా చివరి క్షణంలో అమిత్ షా కేటీఆర్ తో ఇంటర్వ్యూ రద్దు చేశాడు. ఎందుకంటే చివరి క్షణంలో ఈటెల రాజేందర్ ఒత్తిడితో ఆగినారని స్పష్టం. ఈ పరిమాణాలను  సి పి ఐ వారు సిపిఎం వారు  గమనించడం లేదా? వచ్చే ఎన్నికల్లో బిజెపికి 150 నుంచి 200 సీట్లు వస్తే మహా గొప్ప. వారికి కనీసం ఇతర పక్షాల నుండి 120 నుంచి 80 ఎంపీల సపోర్టు కావలసి ఉంటుంది. అలాంటి సపోర్ట్ కోసమే కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి, మాయావతి నుంచి బిజెపి ప్రయత్నిస్తున్నది. వీరందరూ బిజెపి ఒత్తిళ్లకు సి బి ఐ కేసుల వలన లొంగేవారే.  కేసీఆర్  మోడీ కి సపోర్ట్ చేయడానికి సిద్ధమని చెప్పినందునే కవిత అరెస్టు జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు కెసిఆర్, సిపిఐ, సిపిఎం వారికి ఒకటి రెండు పార్లమెంట్ సీట్లను లేదా కొన్ని అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి బిజెపి అంగీకారం తెలుపుతుందా? అలా గెలిచిన సిపిఐ వారు సిపిఎం వారు మోడీకి గాని బిజెపికి గాని లోక్ సభలో గానీ రాజ్యసభ ఎన్నికల్లో గాని సపోర్ట్ చేస్తారా? జాతీయస్థాయిలో సిపిఐ సిపిఎం బిజెపిని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేగాక వారు బిజెపి వ్యతిరేక కూటమిలో చేరినారు .అలా బిజెపిని జాతీయస్థాయిలో వ్యతిరేకించిన వారు తెలంగాణలో బలపడడానికి బీజేపీ నాయకత్వం ఒప్పుకుంటుందా? బిజెపిని కాదని కెసిఆర్ కమ్యూనిస్టులకు సీట్లను  కేటాయించి వారు బలపడడానికి తోడ్పడతాడా? సిద్ధాంతరీత్యా బిజెపి కమ్యూనిస్టులు బద్ధ శత్రువులు. అందుచేతనే కేసీఆర్ కమ్యూనిస్టుల తో సీట్ల సర్దుబాటుకు ముందుకు రావడం లేదు. వారు మరోరకంగా టిఆర్ఎస్ ను బలపరచాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. మరో ఇబ్బంది ఏమంటే సిపిఐ సిపిఎం నాయకత్వ మీద వారి కార్యకర్తల్లో టిఆర్ఎస్  సీట్ల సర్దుబాటు గురించి తీవ్రమైన అసంతృప్తి ఉంది. సిపిఐ సిపిఎం కెసిఆర్ నాయకత్వంలోని బి ఆర్ఎస్ ను బలపరచడం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు వారి నాయకత్వానికి చెప్తున్నారు .కానీ ఒకటి రెండు అయినా అసెంబ్లీ సీట్లకు కేసిఆర్ ఒప్పుకుంటాడేమోనని వారి నాయకులు ఆశపడుతున్నారు .వారి ఆశలు అడియాసలు కాక తప్పవు .ప్రజల్లో పూర్తిగా ఆప్రదిష్ట కాక ముందే వారు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పడం ఒక్కటే వారికి ప్రస్తుతం శ్రేయస్కరం. బిజెపి బూచిని చూపి బిఆర్ఎస్ ను బలపరచడం కూడా వాస్తవ పరిస్థితులు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే నియోజకవర్గం వారీగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే బిజెపికి 15,20 స్థానాలల రావని ఆంచన . 30 40  స్థానాలకు మించి ప్రధాన పోటీ దారుగా ఉండే పరిస్థితి లేదు. బిజెపి ఎంత బలుపును ప్రదర్శించిన మహా అయితే   మిగిలిన ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదువేల నుంచి పదివేల ఓట్లు మట్టుకు రా బట్టుకోగలదు .ఒకటి రెండు చోట్ల వారికి 40 వేల నుంచి 50 వేల వరకు ఓట్లు రావచ్చు. 
ఇక కోదండరాం విషయాన్నికొస్తే అతను కాంగ్రెస్ తో పొత్తుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కనీసం ఐదు స్థానాలు జనసేనకు  కేటాయించాలని బేరమాడినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కాంగ్రెస్ లో టి జే ఎస్ విలీనం చేయమని షరతు పెట్టింది .దానితో  ఒక దశలో కోదండరాం టీజేఎస్ ను రద్దు చేసి కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. కానీ టీజేఎస్ లోని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొందరు ఈ విషయాన్ని తీవ్రంగావ్యతిరేకించారని సమాచారం. గతంలో కమ్యూనిస్టు భావాలు కలిగిన వారు కాంగ్రెస్ వర్గ స్వభావం రీత్యా కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలిీనం  చేయవద్దని కోరినట్లు సమాచారం .మరికొందరు కాంగ్రెస్ లో విలీనం చేస్తే అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు. అందుకే కోదండరాం ఎటు పాలు పోక చివరకు  టీజీఎస్ ను కాంగ్రెస్ లో చేయడం లేదని ప్రకటించాడు. 
ఇక సీట్ల పొత్తు గురించి కాంగ్రెస్ టీజేస్  డిమాండ్ ను అంగీకరించకపోవచ్చు. గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా టీజీఎస్ కు కాంగ్రెస్ ఒకే సీటు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాంటప్పుడు టీజేఎస్ ఒక సీట్ తీసుకొని కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకుంటుందా? అయితే టీజే ఎస్ కు మరోదారి లేనందున కాంగ్రెస్ వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటికీ ఒప్పుక్కోవచ్చు .ఏమైనా వేచి చూడాలి .ఇక ఈటల రాజేంద్ర విషయానికొస్తే ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీరిద్దరూ బిజెపిలో ఇమడకపోవచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఒకప్పుడు కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడైనాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ భావజాలం కలవాడు. వారు లౌకికవాదులు అదిగాక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండలో ముస్లింల ఓట్లు కావాలి. అంతే కాక కర్ణాటక ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వైఖిరి లో స్పష్టంగా మార్పు కనబడుతున్నది. దాని ప్రభావం రాజగోపాల్ రెడ్డి మీద ఉంటుంది.  వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు భావ సారూప్యత కూడా చాలా అవసరం .అది కాక బిజెపి అధినాయకత్వం  ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో వచ్చినవారికి ఇచ్చిన ప్రాధాన్యత ,వారి మీద ఉన్న విశ్వాసం,ఇతర పార్టీల నుఁడి వచ్చిన వారి మీద ఉండదు ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి సలహాల మేరకు బిజెపి నాయకత్వం వారి విధానాలను పూర్తిగా మార్చుకుంటుందని నేను భావించడం లేదు. ఎందుకంటే జాతీయస్థాయిలో మోడీకి వచ్చే  ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వారి సపోర్ట్ అవసరం. అలాంటప్పుడు కెసిఆర్ బిజెపి అధినాయకత్వాల మధ్య ఉన్న పరస్పర ఒప్పందాన్ని బిజెపి నాయకత్వం తిరస్కరించే పరిస్థితిని  ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కల్పించలేకపోవచ్చు .వీరి  సలహాల మేరకు బిజెపి ర నాయకత్వం కూడా తమ విధానాలను మార్చుకుంటుందని నేను భావించడం లేదు. మొదట్నుంచి ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో ఉన్నవారికి  ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బిజెపిలో ఘర్షణ తప్పదు .బిజెపి కేంద్ర రాష్ట్ర నాయకత్వం ముస్లిం క్రైస్తవుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం మతమార్పిడుల పేరు మీద గోహత్య పేరు మీద మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్లనే మెజార్టీ హిందువుల మనోభావాలను తిప్పుకోవచ్చని బిజెపి నాయకుల ప్రణాళిక .బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లాంటివారు తమ భావాలను దాచుకోలేదు  .ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి రాజాసింగ్ భావాలతో ఏక భవిస్తారా? మత విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను  అంగీకరిస్తారా? లేదా సెక్యులర్ భావాలకి రాజేందర్ కట్టుబడి ఉంటాడా? రాజగోపాల్ రెడ్డి ముస్లిం వ్యతిరేకతను కొనితెచ్చుకుంటాడా? అది అతని అన్న వెంకట్ రెడ్డి ప్రయోజనాలను కూడా దెబ్బతీయదా? రాజగోపాల్ రెడ్డి రాజేందర్ బిజెపిలో కొనసాగిన వారికి  గౌరవం  దక్కుతుందా? అది గాక రాజేందర్ రాజగోపాల్ రెడ్డి ఇటీవల తమ భావాలను స్పష్టంగా బిజెపి నాయకత్వానికి చెప్పడం , కేంద్ర ప్రభుత్వం కవితను అరెస్టు చేయించడంలో విఫలమైతే అది కేసీఆర్ బిజెపిల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని ప్రజల భావిస్తారని వాదించడం బిజెపి అగ్ర నాయకత్వానికి మింగుడు పడదు. తాత్కాలికంగా ఈటల రాజేందర్ ను రాజగోపాల్ రెడ్డిని తృప్తి పరచడానికి వారు ఏం చెప్పినా ఆచరణలో బిజెపి నాయకత్వం తమ ప్లాన్ ప్రకారమే అమలు చేస్తారు తప్ప ఈటెల  రాజేందర్ రాజగోపాల్ రెడ్డి చెప్పారని లేదా వారు  బిజెపి నుంచి బయటకు వెళ్తారని తమ విధానాలను మార్చుకుంటారని నేను భావించడం లేదు. ఇక భవిష్యత్తులో అవసరమైతే ఆంధ్ర నుంచి గెలిచిన తెలుగుదేశం ఎంపీల సపోర్టు కూడా ఏదో రకంగా పొందాలని చంద్రబాబునాయుడు లాంటివారు ప్రతిపక్ష కూటమిలో చేరి చాణిక్యనీతిని ప్రదర్శించకుండా ఉండాలని బిజెపి నాయకత్వం చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఇటు కమ్యూనిస్టులు టిఆర్ఎస్ తో అటు ఈటెల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరగా  బిజెపితో విడాకులు తీసుకుంటే మంచిది.
 
 జస్టిస్ బి చంద్రకుమార్ 8978385151

Comments

Popular posts from this blog

Helen Mirren once said: Before you argue with someone, ask yourself.......

Helen Mirren once said: Before you argue with someone, ask yourself, is that person even mentally mature enough to grasp the concept of a different perspective. Because if not, there's absolutely no point. Not every argument is worth your energy. Sometimes, no matter how clearly you express yourself, the other person isn’t listening to understand—they’re listening to react. They’re stuck in their own perspective, unwilling to consider another viewpoint, and engaging with them only drains you. There’s a difference between a healthy discussion and a pointless debate. A conversation with someone who is open-minded, who values growth and understanding, can be enlightening—even if you don’t agree. But trying to reason with someone who refuses to see beyond their own beliefs? That’s like talking to a wall. No matter how much logic or truth you present, they will twist, deflect, or dismiss your words, not because you’re wrong, but because they’re unwilling to see another side. Maturity is...

Why BJP is opposing the Telangana caste census?

The BJP opposes the Telangana caste census primarily due to concerns about its political motivations, alleging that the Congress party is using it for electoral gain rather than genuine welfare of Backward Classes (BCs)  1 3 .  BJP leaders argue that the census distracts from Congress's unfulfilled promises to BCs and could exacerbate social divisions  2 4 .  Additionally, there are fears within the BJP that a detailed caste enumeration might reveal ongoing upper-caste dominance in politics and society, which could challenge their support base  7 8 . The BJP's main arguments against the caste census include: Political Manipulation : BJP leaders assert that the Congress party is using the caste census for political advantage rather than for the welfare of Backward Classes (BCs), claiming it distracts from unfulfilled promises made to these communities  2 4 . Threat to Hindutva Agenda : The party views the census as a potential challenge to its support base a...

JAI HIND: WHO DO WE OWE IT TO?

Though the origin of Jai Hind is usually ascribed to Chempakaraman  Pillai in 1907, it didn’t have a popular usage till Netaji Bose made it the standard greeting of the INA. How this happened to be has a Hyderabad connection. It is believed by Netaji’s close followers that the slogan "Jai Hind" as coined by Abid Hasan Safrani.   Abid Hasan Safrani  was the son of the soil of Hyderabad in India. His real name was Zainul Abedin Hasan. He preferred to be called Abid Hasan. His parents expired during the British Raj. Before that they had sent him to Germany instead of England for higher studies in Engineering stream. During the that time, Netaji Subhas Chandra Bose visited Germany and addressed Indian  prisoners of war & also students and asked them  to join Indian National Army (Azad Hind Fauj). Abid Hasan met him and got inspired by the charisma of Netaji.  He told him that he would join him after finishing his studies. Netaji said tautingly t...