సనాతన ధర్మం గురించి మాట్లాడి సమర్ధించే పెద్దలు, సన్యాసులు, సామాన్యులకు అర్ధం అయే రీతిలో, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, దాంట్లో ముఖ్య కోణాలు ఏమిటి, వివరిస్తే బాగుంటుంది.
ముఖ్యంగా ఈ క్రింది విషయాల మీద సనాతన ధర్మ ప్రచారకుల నుండి స్పష్టత కావాలి.
1. సనాతన ధర్మం, "ఆధునిక ధర్మం, రాజ్యాంగ విలువలు, సమన్యాయం, సమాన విలువలు" వీటిని గౌరవిస్తుందా తిరస్కరిస్తుందా ? వీటి మీద స్పష్టత, వివరణ కావాలి.
2. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థల విషయం లో, సనాతన ధర్మం వైఖరి ఏమిటో స్పష్టత కావాలి. కులవ్యవస్థ వర్ణ వ్యవస్థల పేరుతో తరతరాలుగా నడిచిన, దోపిడీ అణచివేత, ఆధిపత్యాలను, సనాతన ధర్మం సమర్ధిస్తంందా, వ్యతిరేకిస్తుందా అనేదాని మీద స్పష్టత కావాలి.
3. ఇంత వరకు నడుస్తున్న సామాజిక వివక్ష, ఆర్ధిక దోపిడీ, రాజకీయ అణచివేత, వీటి మూలాలు, కుల, వర్ణ వ్యవస్థల్లో ఉన్న చారిత్రక వాస్తవ నేపధ్యంలో, సనాతన ధర్మం, చిత్తశుద్ధితో వీటిని సరిచేసే ప్రయత్నం చేయడానికి బదులు, కుల వర్ణ వ్యవస్థలను సమర్ధించే పరిస్థితే ఉంటే, అత్యధిక జనాభా కలిగిన, ఈ వ్యవస్థల బాధితులు, బీసీలు, ఎస్సీలు, ఆదివాసీలు, మహిళలు,"సనాతన ధర్మాన్ని" భుజాన ఎందుకు మోయాలి ? ఎందుకు ఆదరించాలి ? ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం రాజ్యాంగ విరుద్ధం కాదా ? సనాతన ధర్మం పేరుతో ఈ దోపిడీ అణచివేత అవమానాలను ఇంకా ఎన్ని దశాబ్దాలు, శతాబ్దాలు భరించాలి ?
బాధితులు ఎందుకు తిరగబడరు ?
4. తపస్సు చేసుకొంటున్న "శంభూకుని వధించిన" శ్రీరామ చంద్రుణ్ణి, "సనాతన ధర్మం" నేటి ఆధునిక యుగంలో కూడా ఎలా సమర్ధిస్తుంది ? అదేవిధంగా ఏకలవ్యుని "బొటన వేలుని" కానుక గా తీసుకొన్న ద్రోణుణ్ణి ఆధునిక యుగంలో కూడా ఎలా సమర్ధిస్తుంది ? సూక్తులు మాత్రమే సరిపోవు. అన్యాయానికి పరిష్కారం కావాలి.
5.సనాతన ధర్మ సమర్దకులారా,
ఇంట్లో న్యాయం చేయని మీరు,సమ న్యాయానికి అడ్డుపడే మీరు విశ్వగురువులమని ఎలా ప్రచారం చేసుకుంటారు?
కొండలరావు
8/9/2023
Comments
Post a Comment