Skip to main content

"భ్రమ"లో బతుకుతున్న మనిషి


మనదేశంలో 90 శాతం మంది ప్రజలు "భ్రమ"లో బతుకుతున్నారు. ఎవరో చెప్పిన మాటలను విని  వాస్తవాలు ఆలోచించక, తెలుసుకోలేక  భ్రమలో బతుకుతున్నారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్న ట్టుగా కపట వేషధారులైన స్వామీజీలు, బాబాలు చెప్పిన మాటలు విని,  తలలూపుతూ వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు.ఆర్థికంగా నష్టపోతున్నారు. శాస్త్రవేత్తల కన్నా స్వామీజీలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు గౌరవిస్తున్నారు.

మనిషి వాస్తవాలను చూస్తూ, వింటూ ఎవరో చెబుతున్నారని మన కంటి ముందు కనిపించని వాటిని కూడా పిచ్చిగా నమ్మేస్తున్నాడు.
ఒక్కొక్కసారి భ్రమ పడడం సహజమే. భ్రమ పడినటువంటి విషయము ఒక్కొక్కసారి నిజం కావచ్చు కాకపోవచ్చు అందుకోసం ఈ విషయాన్ని మనం స్వయంగా ప్రశ్నించి,మన జ్ఞానేంద్రియాలతో దానిని పరిశీలించి, ప్రయోగాల ద్వారా సాక్ష్యాధారాల ద్వారా ధృవపరుచుకొని ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవాలి. 

కొందరు మనం దేవుని బిడ్డలం, దేవునికి జన్మించాము అంటుంటారు. మరికొందరు దేవుడున్నాడని ఆయన మన పాపాలను లెక్కకడుతున్నాడని, పాపాలు ఎక్కువైతే నరకంలోకి పంపిస్తాడని, పుణ్యాలు ఎక్కువైతే స్వర్గం లోకి పంపిస్తాడని చాలామంది అంటుంటారు. కానీ ఇవేవీ నిజాలు కావు అన్ని అబద్ధాలే.  తమ పొట్టకూటికోసం కొందరు స్వార్ధపరులు ఇలా చెప్పి తమ పబ్బం గడుపుకొని విలాసంగా బతుకుతున్నారు.

ఒక విషయం గురించి కొందరు కొన్ని అబద్ధాలు చెప్తారు. కొందరు ఇతరులు చెప్పిన దానిని చెబుతారు. కొందరు వాస్తవాలు చెబుతారు. అబద్దం తొందరగా ఆకర్షింపబడుతుంది. ఇద్దరు మనుషులు వేరువేరుగా చెప్పినప్పుడు, అది నిజమో కాదో అని సందేహంలో ఉంటాడు మనిషి.  

మనము దారి వెంబడి వెళుతున్నప్పుడు దూరంగా వంకలు తిరిగిన తాడు కనబడితే ఒక్కొక్కసారి మనము దాన్ని పాము కావచ్చని అనుకుంటాం.
కానీ దగ్గరికి వెళ్లిన తర్వాత అది తాడు అని తెలుస్తుంది. రాత్రిపూట మనము గ్రామాల్లో బయటకు వెళ్ళినప్పుడు ఈత చెట్టు లాంటివి విరబోసుకుని నిలబడ్డట్టుగా కనిపిస్తాయి వాటిని దెయ్యము అని భ్రమపడతారు కొందరు.

మన దేహంలో ఆత్మ ఉందని కొందరు చెబుతున్నారు.... ఆత్మ నీటిలో నానదు, అగ్నితో దహింపదు. ఏ అస్త్ర శస్త్రాలు ఛేదించవు.
ఆత్మకు చావు లేదని చెప్తుంటారు. దానికోసమై ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. డాక్టర్లు చనిపోయిన మానవ శరీరాన్ని కోసి చూశారు కానీ అందులో ఆత్మ అనే పదార్థం కనబడలేదు. 


కొందరు స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్తుంటారు.  "ఉన్నాయి నమ్మండి" అంటారు అది కేవలం నమ్మకం మాత్రమే కానీ నిజం కావచ్చు కాకపోవచ్చు.
 మన జ్ఞానేంద్రియాల ద్వారా చిక్కితే అది ఉన్నట్టే. లేకుంటే వాళ్ళు కొఅబద్ధం చెపుతున్నారని గ్రహించాలి. ఇంతవరకు ఏ ఒక్క మనిషి కూడా అక్కడికి వెళ్లి చూసి వచ్చినవాడు లేడు కాబట్టి, దానిని నమ్మకూడదు. అది లేనట్టే అని మనము గ్రహించాలి. అలాగే గత జన్మలు మరుజన్మలు ఉన్నాయని మనమంతా కర్మఫలం అనుభవించే వారమేనని కొందరు బాబాలు స్వామీజీలు చెప్తుంటారు
 తమ స్వార్థం కోసం, తమ దోపిడీ కోసం దేవుడిని అడ్డం పెట్టుకొని దోపిడీ సాగించాలని "ఉన్నాడు"
అని అంటున్నారు.దానిని మనము నిజమా? కాదా? అని పరిశీలించి, విశ్లేషించి ప్రయోగాల ద్వారా సాక్ష్యాధారాల ద్వారా ధృవపరుచుకుని ఆపైన నిజమైతే నమ్మాలి అబద్ధమైతే నమ్మకూడదు. 

ఒక అబద్ధం చెప్పినప్పుడు అట్టి అబద్ధాన్ని సమర్థించడానికి వంద అబద్ధాలు కూడా ఆడవలసి వస్తుంది ఉదాహరణకు దేవుడున్నాడని ఒక అబద్ధం చెబితే దానిని సమర్థించడానికి,
 దాన్ని ఉనికిలో  ఉంచడానికి ఎందరో స్వాములు ఉన్నవి లేనివి కల్పించి, ప్రవచనాలు చెప్పాలి. ఎందరో పూజారులు పూజలు చేయాలి. వీధివీధిన గుడులు కట్టాలి. అక్కడ విగ్రహాలు పెట్టి పూజలు జరిపించాలి. సైన్సుతో తయారైన ప్రచార సాధనాలు ఉపయోగించాలి.
.  
 కొందరు స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్తుంటారు.  ఉన్నాయి నమ్మండి అంటారు అది కేవలం నమ్మకం మాత్రమే కానీ నిజం కావచ్చు కాకపోవచ్చు.
 మన జ్ఞానేంద్రియాల ద్వారా చిక్కితే అది ఉన్నట్టే. లేకుంటే వాళ్ళ అబద్ధం చెపుతున్నారని గ్రహించాలి. ఇంతవరకు ఏ ఒక్క మనిషి కూడా అక్కడికి వెళ్లి చూసి వచ్చినవాడు లేడు కాబట్టి, దానిని నమ్మకూడదు. అది లేనట్టే అని మనము గ్రహించాలి.
మనిషి తన చుట్టూ ముసురుకుంటున్న  అజ్ఞానమే హాయిగా ఉందని ఆ భ్రమలోనే బతుకుతున్నాడు. దేవుడు ఉన్నాడని స్వర్గ నరకాలు ఉంటాయని ఆత్మ ఉంటుందని చనిపోయిన పితరులకు పిండ ప్రదానాలు చేస్తే  వారి ఆత్మ శాంతిస్తుందని, ఈ విధమైన మూర్ఖత్వంలో అజ్ఞానంలో మనిషి జీవితాన్ని సాగిస్తున్నాడు. తనలోఅంతర్గతంగా ఉన్న హేతుత్వాన్ని, హేతువాద దృక్పథాన్ని అణచివేస్తున్న ఇలాంటి వాటికి బానిసయై బతుకుతున్నాడు. 

ప్రస్తుతం మనుషులలో ఆలోచన శక్తి నశించింది. అనులోచనా పరత్వం పెరిగింది.
అన్ని ఆలోచిస్తున్నాడు కానీ హాని కలిగిస్తున్న మతాలు, మత గ్రంధాలు, దైవ భావన, స్వర్గ నరకాలు,ఆత్మ ఉనికి  ఆలోచించకుండా,
కపట వేషదారుల మాటలు విని తమ జీవితంలో ఆర్థికంగా నష్టపోతున్నారు పేదవారుగా మిగిలిపోతున్నారు.
ప్రజల్లో ప్రశ్నించే తత్వం తగ్గిపోయింది.
 తన స్నేహితులు చెప్పారని, తల్లితండ్రులు చెబుతున్నారని, గురువులు బోధిస్తున్నారని చెప్పుడు మాటలు వినడమే అలవాటుగా చేసుకున్నాడు. దీనివల్ల  నష్టపోతున్నానని గ్రహించడం లేదు.

సైన్సు ప్రకారంగా చూస్తే దేవుడు, ఆత్మ,స్వర్గ నరకాలు, గత జన్మ మరుజన్మలు లేవని తేలిపోయింది.ఇప్పటివరకు వాటికి సాక్ష్యాధారాలు లేవు. అవన్నీ అబద్ధాలే.దోపిడీదారుల కల్పిత మాటలే, కల్పితగాథలే తప్ప  వాస్తవమైనవి కావు.

 వాటిని ఎవరు చూసినవారు లేరు. చూసి మరల వచ్చిన వారు లేరు.కాబట్టి మనిషి వీటిని ప్రశ్నించి, పరిశీలించి వాటి వల్ల తనకు ఏదైనా అనుభవం కలిగితేనే నమ్మాలి.

"చెప్పుడు మాటలు చేటు" అని ఒక సామెత ఉంది.

 చెప్పుడు మాటలు విని మోసపోకండి.

                 అడియాల శంకర్
                          అధ్యక్షులు 
    తెలంగాణహేతువాదసంఘం
          Cell.No7093062745

Comments

Popular posts from this blog

Helen Mirren once said: Before you argue with someone, ask yourself.......

Helen Mirren once said: Before you argue with someone, ask yourself, is that person even mentally mature enough to grasp the concept of a different perspective. Because if not, there's absolutely no point. Not every argument is worth your energy. Sometimes, no matter how clearly you express yourself, the other person isn’t listening to understand—they’re listening to react. They’re stuck in their own perspective, unwilling to consider another viewpoint, and engaging with them only drains you. There’s a difference between a healthy discussion and a pointless debate. A conversation with someone who is open-minded, who values growth and understanding, can be enlightening—even if you don’t agree. But trying to reason with someone who refuses to see beyond their own beliefs? That’s like talking to a wall. No matter how much logic or truth you present, they will twist, deflect, or dismiss your words, not because you’re wrong, but because they’re unwilling to see another side. Maturity is...

The battle against caste: Phule and Periyar's indomitable legacy

In the annals of India's social reform, two luminaries stand preeminent: Jotirao Phule and E.V. Ramasamy, colloquially known as Periyar. Their endeavours, ensconced in the 19th and 20th centuries, continue to sculpt the contemporary struggle against the entrenched caste system. Phule's educational renaissance Phule, born in 1827, was an intellectual vanguard who perceived education as the ultimate equaliser. He inaugurated the inaugural school for girls from lower castes in Pune, subverting the Brahminical hegemony that had long monopolized erudition. His Satyashodhak Samaj endeavoured to obliterate caste hierarchies through radical social reform. His magnum opus, "Gulamgiri" (Slavery), delineated poignant parallels between India's caste system and the subjugation of African-Americans, igniting a discourse on caste as an apparatus of servitude. Periyar's rationalist odyssey Periyar, born in 1879, assumed the mantle of social reform through the Dravidian moveme...

AI & Higher Education: The Empty Classroom

  ARTIFICIAL INTELLIGENCE & HIGHER EDUCATION The Empty Classroom When students outsource learning to AI and companies cut the engineers who know better, both ends of the talent pipeline fray at once. India is not watching from a safe distance. Chuppala Nagesh Bhushan At the University of California, Berkeley, something unremarkable happened in spring 2026: a professor held office hours. The unremarkable part was that nobody came. Dan Garcia, who teaches CS 10, a broad introductory computing course popularly called “The Beauty and Joy of Computing,” found his calendar conspicuously clear at the very moment his gradebook became conspicuously alarming. Of the students who sat CS 10’s final examination, 35.3% received an F—five times the historical norm of roughly 7%. Two other courses in Berkeley’s elite Electrical Engineering and Computer Sciences department suffered similarly: 10.6% of CS 61A students failed, and 16.8% of those in EECS 127, an upper-division optimi...