(👌చారిత్రక,సాంస్కృతిక పరిశీలన)
*☸️హోలీ పండుగ (కాముని పండుగ) ☸️*
🌹హోలీ అనేది రంగుల పండుగ, వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా తూర్పుఆసియా దేశాల ప్రజలుజలందరు జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమబెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని డోల్‌యాత్రా (డోల్జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు.
*హోలీ అంటే ఏమిటి?*
హోలీ అనే పదము ‘డోలి’ అనే పదము నుండి వచ్చింది.ఇది మాగది భాషాపధం.డోలి అంటే ఊగడము అని అర్ధము.
*హోలీ ఏ కాలంలో వస్తుంది?*
ఇది సాధారణంగా మార్చినెల తదుపరి వచ్చే చివరి ఫాల్గుణమాసము శుక్లపక్షం అష్టమిరోజు ప్రారంభమై ఫాల్గుణపూర్ణిమకు ముందురోజు “కామదహనం” చేసి మరుసటిరోజు ఫాల్గుణపూర్ణిమ రోజున రంగులతో “రంగపంచమి”ఉత్సవాన్ని( ఐదురకాలరంగులతో) జరుపుకుంటారు.
*తెలంగాణాప్రాంతాలలో ఈ పండుగను ఏమంటారు?*
తెలంగాణాప్రాంతములో ఈ పండుగను 'కామదహనం', 'కాముని పండుగ' లేదా 'కాముని పున్నం' అని అంటారు. ఈ పండుగ యొక్క ప్రధానఘట్టం మండుచున్న హోలీమంటలలో కాముడి మరియు బీముడి ప్రతిమను దహనం చేస్తారు.
*ఇది జైనుల పండుగా? బౌద్ధుల పండుగా? లేక హిందువుల పండుగా ?*
ఇది బౌద్ధ, జైన మరియు హిందూ సాంప్రదాయాలు పుట్టక ముందే ఆటవిక సమాజం నుండి వస్తున్న సాంప్రదాయపు పండుగ. నాటి ఆటవిక సమాజంలో గుంపులు గుంపులుగా, చిన్న చిన్న సమూహాలుగా ఉంటూ సంచార జీవనాన్ని గడుపుతూ ఉన్న రోజుల్లో ఒక సమూహముపై మరో సమూహము దాడిచేసి బలహీనులను ఓడించి,వారి సంపదను(పశు పక్షాదులను), నచ్చిన స్త్రీలను /పురుషులను ఎత్తుకెళ్లేవారు.ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే - ఇక్కడ బలము మరియు కామము కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ గ్రామాలల్లో స్త్రీలు కామ దహనం తరువాత ఒక పాట పాడుతారు.
“బీముడు కాలే బిరబొగ్గాయే బీముని పెళ్ళం నాబానిసాయే!
ఇసుంట రావు కామయ్యో ముచ్చాల పందిరి కిందంగా!!”
"కాముడు కాలే కరెబొగ్గాయే కాముని పెళ్ళం నాబానిసాయే!
ఇసుంట రావు కామయ్యో ముచ్చాల పందిరి కిందంగా!!”
ఈ పాట మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీక. మనపై దాడి చేయడానికి వచ్చిన బలవంతుడిని ఓడించాను. వాడి భార్యను నా భానిసను చేసుకున్నాను. కామాంధుని ఓడించాను. వాడి భార్యను నా బానిసను చేసుకున్నాను.ఇక మనకు ఏ అడ్డులేదు, పరిణయమాడుకుందాం రా! అని తన సహచరుని పిలుస్తుంది.ఈ పాటలో.
*ఇది ఉత్సవం గా ఎలా మారింది?*
కాలక్రమేనా సమూహాలు పెరిగాయి. వారి మధ్య అవగాహనలు పెరిగాయి మరియు అవసరాలు పెరిగాయి. ఒకే సమూహంలో ఒక యువతిని చేసుకోవాలనుకున్న యువకులు పోటీ పడి యుద్ధంలో ఓడించి సాదించుకునేవారు.అదేవిధంగా యువతులు కూడా. ఈ తంతు సామూహిక వివాహ వేదికైనది.ఇది ప్రారంభంలో చాల హింసాత్మకంగా ఉందేది.ఇది రానురాను స్వయంవరంగా మారింది. ప్రతీ సంవత్సరం చివరి పూర్ణిమరోజు జరిగేది. ఉగాది నుండి కొత్త జీవితాన్ని గడుపుతారు.ఇప్పటికీ వివాహమైన 16 రోజులకు పదహారొద్ధుల పండుగ చేస్తారు.
*ఈ పండుగకు బౌద్ధానికి ఏమైన చారిత్రిక సంబంధం ఉన్నదా?*
ఉన్నది. గౌతముడు పరివ్రాజకుడై జ్ఞానాన్వేషణ కొరకై తపస్సుకు ఉపక్రమించగా (తపస్సు అంటే అర్ధమేమిటంటే అన్వేషణతో తపించడం అని అర్ధం అంటే త+పశనము = తపశనము. వాడుకలో తపస్సు అయింది).తన తపస్సును భంగం చేయడానికి మారుడు తన కుమార్తెలను సిద్దార్ధుని దగ్గరకు పంపుతాడు.అప్పుడు బుద్ధుడు వారిని జయిస్తాడు.చివరికి మారుడు కూడా బుద్ధుడితో తలపడతాడు.అతడిని కూడా ఓడిస్తాడు.కావున వారిని జయించిన రోజును బౌద్ధులు ఈ పండుగను జరుపుకుంటారు.
*ఇది కల్పిత కథ కాదా?*
కాదు. సిద్ధార్ధుడు బుద్ధుడైన తరువాత 84,000 సుత్తాలను ప్రభోదించాడు. ప్రతీ సుత్తము ప్రతీకలుగాను, కథలుగాను, సామెతలుగాను, సాంప్రదాయాలలో ఆచారాలలో చేర్చి జనబాహుల్యంలో బద్రపరిచి, శాశ్వతంగా నిలిచిపోయేలా చేసారు.
ఇక్కడ మారుడు అంటే మరణం అని అర్ధం. అంటే అదమ స్థానమునకు దిగజారిపోవడం అని అర్ధం.మారుని ముగ్గురు కుమార్తెల పేర్లు 1)తనహా (శరీర వాంఛ), 2) అరతి (అసహ్యం) ౩) రాగ (మోహము) వారిని జయించిన రోజు.ఒక మనిషి అధముడు కావడానికి ఈ మూడు కారణాలు అవుతాయి. ఈ మూడింటిని సిద్ధార్థుడు జయించిన రోజు కావునా ప్రతివ్యక్తి తనహ, అరతి, రాగా లను బోగి (బోధి) మంటలతో దహింప చేసుకొని పరిపూర్ణమైన వ్యక్తిలా జీవించాలని ఈ పండుగ ప్రధాన ఉద్దేశము.
*ఇంకా బౌద్ధానికి ఏమైనా సంబంధం ఉన్నదా?*
ఉన్నది. సిద్ధార్థుడు బుద్ధుడు అయిన తరువాత తన ధమ్మసేన తో సుధూర ప్రాంతాలకు కాలినడకన వెళుతూ ధమ్మ ప్రచారం చేస్తూ, కపిలవస్తు నగరానికి చేరుకుంటాడు.ఒక మామిడి తోటలో విడిదిచేసి, తెల్లవారు జామున బిక్షాటనకు తన బిక్షు సంఘంతో బయలు దేరినాడు. కపిలవస్తు నగర వాసులు బుద్దున్ని సిద్ధార్థునిగా గుర్తించి, సుద్దోదనునికి ఈవార్త చేరవేస్తారు. ఆ నోటా ఈ నోట విన్న సుద్దోదనుడు బుద్ధుడి వద్దకు వెళ్లి ఈ దేశ రాకుమారుడివి,నీకు అడుక్కునే కర్మ నీకేమిటని రాజప్రసాదానికి రమ్మంటాడు.అందుకు బుద్ధుడు “అడుక్కోవడం భిక్కు సంఘం నియమమని - తనహా, అరతి, రాగాలకు అతీతుడనని, తానూ రావడం బిక్షు సంఘ నియమము కాదని సున్నితంగా నిరాకరిస్తాడు. అయితే సుద్దోదనుడు బిక్కు సంఘాన్ని బిక్షకు ఆహ్వానిస్తాడు. అందుకు బుద్ధుడు అంగీకరిస్తాడు.
ఈ వార్తను యశోధరకు తెలియ జేస్తాడు.యశోధర ఎనలేని సంతోషం పొందుతుంది. ఆ విషయాన్ని గమనించిన రాహులుడు తల్లిని తన సంతోషానికి కారణం అడుగుతాడు. ఆ ఆనందానికి కారణం - మీ తండ్రి మన ఇంటికి భిక్కు గణంతో వస్తున్నాడని చెబుతుంది. అప్పుడు రాహులుడు అంతమంది భిక్కు గణములో తన తండ్రిని ఎలా గుర్తించాలని అడుగు తాడు.అందుకు యశోధర బుద్ధుడి యొక్క గుణగణాలను “నరసింహా సుత్తం” ద్వారా ఉత్తమ పురుషుని లక్షణాలు వివరిస్తుంది(నరసింహా అంటే నరులలో సింహం లాంటి వాడని అర్ధం).
ఈ పూర్ణిమ రోజున బుద్ధుడు సుద్దోదనుని గృహమునకు విచ్చేసి, ధమ్మ దేసన చేసినాడు.అదేరోజు రాహులుడు,ఆనందుడు,దేవదత్తుడు ఇంకా చాలామంది శాక్య యువకులు భిక్కు సంఘంలో చేరుతారు. బుద్ధుడు ఈ రోజున ధమ్మ దేసన చేసాడు. కాబట్టి ఈ రోజును 'ధమ్మ డే' గా బౌద్ధులు ఆచరిస్తారు.
*బౌద్ధానికి ఈ హోలికి సంబంధం ఏమిటి?*
బౌద్దం యొక్క ప్రధాన లక్ష్యం “లోక కళ్యాణం”.ఒక మనిషిలోని, సమాజంలోని రుగ్మతులను తొలగించి, మానవ శ్రేయస్సుకు మరియు సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తుంది.మానవ సమాజములోని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వ్యతిరేకించలేదు.అందులోని అవలక్షణాల స్థానంలో మంచిని మరియు ధమ్మాన్ని జోడించింది. కాని వారి జీవన శైలికి ఎక్కడ అంతరాయం కలిగించలేదు. బౌద్దం ఇన్ని రోజులు మనగలగడానికి ప్రధాన కారణము ఇదే.
*ఇక పండగను ఒక్క సారి పరిశీలిద్దాం.*
ఎనిమిది రోజులు యువతీ, యువకులు ఇంటింటికి వెళ్లి పాటలు పాడుతూ భిక్షాటన చేస్తారు.బౌద్ధ బిక్షువులు ఇంటింటికి వెళ్లి ధమ్మదేసన చేసి,భిక్ష స్వీకరిస్తారు. ఆనాడు కపిలవస్తు నగరంలో బుద్ధుడు భిక్షాటన చేసినందుకు ప్రతీక ఇది.
యువతీ, యువకులు సహచరులను ఎన్నుకోవడానికి చేసే ప్రయత్నములో నచ్చిన వ్యక్తిని బలవంతగా ఎత్తుకెళ్ళడం, అడ్డం వచ్చిన వారిని తన బలముతో ఓడించి ఎత్తుకెళ్ళడం జరిగేది. ప్రత్యర్ధిని ఓడించి తను కోరుకున్న వ్యక్తిని దక్కించుకునే వారు. ఈ స్థానంలో బౌద్ధ దమ్మాన్ని జోడించడం జరిగింది.కామున్ని మరియు భీమున్ని భోగి (బోధి) మంటల్లో దహనంచేసి, అంటే కామాన్ని, బలాన్ని త్యజించి, నచ్చిన వ్యక్తిని బలప్రయోగంతో కాకుండా తన మనసులోని భావాలను తెలియజేయడానికి ఐదు రకాల రంగులను (పంచ శీలాలకు ప్రతీక) చల్లుకుంటారు. అందుకే దీనిని “రంగపంచమి”ఉత్సవం అంటారు.ఇది ఇప్పటికి గ్రామాల్లో వరుసైన వారిపైనే రంగులు చల్లుకుంటారు.కానీ వేరే వారిపై చల్లరు.
నేటికి వివాహం ఒక యద్ద తంతే. హోలీ ప్రక్రియలోనే జరుగుతుంది. వివాహం జరిగే ముందు రోజు వరుని ఇంటి నుండి ముందు కబురు పంపుతారు. మీపై యుద్దనికి వస్తున్నాం, మిమ్ములను ఓడించి మీ కూతురుని ఎత్తుకేలతామని దాని సారాంశం. మరుసటి రోజు ఊరి బయట విడిది చేస్తారు.అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారిని ఎదిరించడానికి (ఎదురుకోలు) వెళతారు. వీరు వారు ఎదురు పడగానే ఒకరిపై ఒకరు పత్తి గింజలు, పసుపు బియ్యం కసితీర విసురుకుంటారు. తరువాత వారి వద్ద నున్న దుప్పట్లు,చాపలు ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇది యుద్ధానికి ప్రతీక. గెలుపు ఓటమిలు నిర్దారించుకుంటారు. తరువాత రాజీకి వచ్చి వరుసైనవారు పసుపు కుంకాలు పూసుకొని పరిహాసాలు ఆడుకుంటారు. యోగ క్షేమాలు తెలుసుకొని,వారిని తమ ఇంటికి తోడుకొని పోతారు. వివాహము చేసి వరుడితో తమ కూతురును పంపిస్తారు.
ఈ పండుగ కాలక్రమేనా హిందూవీకరిచబడినది.'నరసింహ సుత్తం' నరసింహ పురాణం గా, 'హోలీ' రాధాకృష్ణ రాసకేళిగా మార్చబడినది. తరువాత విపరీత ధోరణులకు దారితీసింది.
*వీటికి ఆదారాలు ఏమిటి?*
1. బౌద్ధ గ్రంధాలు
2. అశోకుడి చరిత్ర
3. 7వ శతాబ్దంలో వ్రాయబడిన “రత్నావళి “అనేనాటకం.
4. మన సాంప్రదాయాలు , పండుగలు , ఉత్సవాలు మరియు జాతరలు.
*శీలం ప్రభాకర్ ,(బి.యస్.ఐ)*
*☸️ధమ్మపద ఫిలోమత్ సొసైటీ*
25-03-2024
Comments
Post a Comment