ఏలేటి నాయకులు
ఊరేగుతున్నారు.
ప్రపంచ దేశాల వెంట
పరిగెడుతున్నారు.
అలసి సొలసిన నాయకులు
సేధ దీరుతున్నారు.
ఆనందం,ఆరోగ్యం, కాపాడుకొని
దేశాన్ని ఏలుతున్నారు.
జెండాలు మోసే కార్యకర్తలు
జగడాలాడుకొంటూన్నారు.
జనాల మధ్య కొట్లాడుకొని
జైలుకు పోతున్నారు.
రక్షణ కోసం ఏర్పడిన ఓటును
రాక్షసులు తన్నుకు పోతున్నారు.
అన్నదమ్ములు మద్య తగుపడి
ఆస్తులు తగలబెట్టుకుంటున్నారు.
ఆంధ్ర ప్రజానీకమా!
ఒకసారి ఆలోచించవా?
జరుగుతున్న పరిణామాల్ని
పరిశీలించలేవా?
మీ
✍️
చోడి ఆదినారాయణ.
ప్రజా హక్కుల సాధన సమితి కన్వీనర్.9618130308.
Comments
Post a Comment