*బీసీలు అప్రమత్తంగా ఉండాలి.*
వాస్తవాల మీద అవగాహన లేక *పంచాయతీ రాజ్ వ్యవస్థ లో బీసీల రిజర్వేషన్ విషయం లో,* రాజకీయ పార్టీల వాగ్ధానాల్ని నమ్మి మోస పోతున్న బీసీలు, మీరు ఈ సందర్భంగా తెలుసు కోవాల్సిన కొన్ని ముఖ్య వాస్తవాలు:
------------------------------------------------------------
1. AP Panchayat Raj Act, 1994 లో పొందు పరచ బడిన గేసూత్రాల ప్రకారం 1995, 2001, 2006 సంవత్సరాల్లో ఈ సంస్థల్లో జరిగిన ఎన్నికల్లో, ఎస్సీ ఎస్టీ బీసీలకు వరుసగా, 18.3%, 8.25%, 34% రిజర్వేషన్ కల్పించారు. ఈ పై మూడు సంవత్సరాల ఎలక్షన్ల సందర్భంగా, ఈ మూడు వర్గాల వారికి దొరికిన మొత్తం రిజర్వేషన్ 60.55%.
2. దరిమిలా 11-5-2010 నాటి డా. కె. కృష్ణ మూర్తి కేసు లో, సుప్రీంకోర్టు తీర్పు లోని, ఆదేశాల ప్రకారం, పంచాయతీ వ్యవస్థలో కూడా మొత్తం రిజర్వేషన్ 50% దాటకూడదు అంటూ పరిమితి విధించబడింది. ఈ పరిమితి మేరకు దరిమిలా జరిగే అన్ని ఎలక్షన్ల సందర్భంగా బీసీలు ఆనాటి వరకు పొందుతున్న 34% రిజర్వేషన్ కు కోత విధించడం తప్పని సరి అయింది. అందుచేత బీసీల రిజర్వేషన్ 23.45% తగ్గించడం జరిగింది.
3. ఈ సుప్రీంకోర్టు తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది. ఈ ధర్మాసనానికి ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జీ. బాలకృష్ణ గారు నాయకత్వం వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ గారు ఎస్సీ వర్గం వారు కావడం విశేషం.
4. ఈ తీర్పు ప్రకారం నష్ట పోతూ వస్తుంది కేవలం బీసీలు మాత్రమే. ఎందుచేతనంటే 1992 నాటి, 72 రాజ్యాంగ సవరణ ప్రకారం, ఎస్సీ ఎస్టీ వారికి, దామాషా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మహిళలకు 33.3% కి తక్కువ కాకుండా, రిజర్వేషన్ కల్పించడం జరిగింది.
5. బీసీల రిజర్వేషన్ ఎంత మేరకు ఉండాలి అనే విషయం స్పష్టంగా నిర్దేశించ కుండా, Article 243 D (6) ప్రచారం ఆ విషయాన్ని రాష్ట్ర శాసనసభకు విడిచి పెట్టింది. ఆవిధంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు వారి రిజర్వేషన్ లకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగం, బీసీ రిజర్వేషన్లకు కేవలం చట్ట ప్రతిపత్తి తోనే విడిచి పెట్టేసారు.
6). పంచాయతీ వ్యవస్థ లో బీసీల కు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, "కామారెడ్డి డిక్లరేషన్" ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అమలు కావడం చాలా కష్టమే. ఈ విషయాన్ని అర్ధం చేసుకొనే చైతన్యం లేని బీసీలు 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవి అమలు చేయడానికి 2010 నాటి సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వస్తుంది. నాటి నుండి నేటి వరకు ఈ తీర్పు మీద ఇటు బీసీలు కాని, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కాని ఎవరూ సుప్రీంకోర్టు లో "రివిజన్" పిటిషన్ లు దాఖలు చేయ లేదు. ఆ తీర్పును ఏవిధంగానూ ఈనాటి వరకు సవాలు చేయలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా, ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ సవరణ ను కూడా ప్రభుత్వం చేపట్టలేదు. ఈ మొత్తం పరిస్థితికి మూల కారణం బీసీల చైతన్య రాహిత్యమే. బీసీలను ఓటుబ్యాంకు గా మాత్రమే వాడుకొంటున్న రాజకీయ పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడమే.
7. బీసీలను మాత్రమే బాధితులను చేసిన ఈ తీర్పుకు, రాజ్యాంగ సవరణే పరిష్కారం అని చెబుతూ, ఈ తీర్పు కు సంబంధించిన కొన్ని కోణాల్ని స్పృశించి విశ్లేషిస్తూ, నేను రాసిన వ్యాసం 11-6-2011 నాటి సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వ్యాసం శీర్షిక: *పంచాయతీ రాజ్ సంస్థల్లో రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణే బీసీలకు రక్ష.* ఈ వ్యాసం ప్రతులను ఆనాడు బీసీల మధ్య విస్తృతంగా పంచడం జరిగింది.
-- కొండలరావు
2-6-2024
(తెలంగాణ ఆవిర్భావదిన శుభాకాంక్షలతో)
Comments
Post a Comment