#వక్షోజాలపై_వస్త్రం_ధరిస్తే_పన్ను.#వక్షోజాల_పరిమాణ_బట్టీ_పన్ను
ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. సమాజంలో రాయల్టీ ఉన్న మహిళలు మాత్రమే వక్షోజాలను దాచుకోవచ్చు. మిగతా వారు వక్షోజాలు చూపించాలి. చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి. అప్పట్లో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. 18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించారు. ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు. ఈ పన్ను చాలా దారుణంగా ఉండేది. ఈ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.
రాజు ఆజ్ఞ ప్రకారం అప్పట్లో ట్రావెన్‌కోర్ రాజ్యంలోని దిగువ వర్గానికి చెందిన మహిళలంతా వక్షోజాలపై ఎలాంటి వస్త్రం ధరించకుండానే ఉండేవారు. వారు పొలంలో పని చేస్తున్నప్పుడు, గ్రామంలో తిరిగేటప్పుడు కూడా ఎలాంటి వస్త్రం ధరించేవారు కాదని ఆచారం ఉండేదట.
ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు స్తనాలు కనపడకుండా వస్త్రాలు ధరించాలంటే కచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి. పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు. కచ్చితంగా పన్ను కట్టి ధరించాల్సిందే . అప్పటి కుల వివక్షతకు ఇదే నిదర్శనం.. ఇందులో మరింత అసహ్యకరమైన అంశం ఏమిటంటే రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుండేవట!
అయితే రాజు నిబంధనలు నంగేళి కి నచ్చలేదు. ట్రావెన్ కోర్ రాజు ఆజ్ఞను నంగేళి దిక్కరించింది. అంతమకు ముందు ఆమె కూడా వక్షోజాలపై ఎలాంటి వస్త్రంధరించకుండానే పొలం పనులు చేసుకునేది. గ్రామంలో తిరిగేది. కానీ ఆమెకు అలా వక్షోజాలను అందరికీ చూపించుతూ తిరగడం చాలా అవమానకరంగా అనిపించింది.
ఒకరోజు నంగేళి వక్షోజాలపై వస్త్రాన్ని ధరించింది. అలాగే పొలం పనులకు వెళ్లింది. ఆమె స్తనాలపై వస్త్రం ధరించిన విషయం ప్రజలందరికీ తెలిసిన కూడా ఆమె భయపడలేదు. రాజు చెప్పినట్లుగా పన్ను ఆమె కట్టలేదు.
వక్షోజ పన్ను నేను కట్టను అని నిర్ణయించుకుంది. ఈ విషయం మహారాజు మార్తాండ్ వర్మకు తెలిసింది. నా ఆజ్ఞను నంగేళి అనే మహిళా దిక్కరిస్తుందా అని రాజుకు కోపం వచ్చింది. వెంటనే ప్రవతియార్ (టాక్స్ కలెక్టర్) ను పిలిపించాడు.
ఏం చేస్తున్నారు మీరు.. ఆ నంగేళి నుంచి పన్ను వసూలు చేసుకురండి అని మందలించాడు. రాజు దగ్గర అవమానం చెందిన ప్రవతియార్ ఎలాగైనా నంగేళి నుంచి పన్ను వసూలు చేయాలని బయల్దేరాడు.
నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లిన ప్రవతియార్, రాజు ఆదేశాలను నంగేళి కి చెప్పాడు. రాజు అనుమతి లేకుండా పన్ను కట్టకుండా నువ్వు ఎలా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరిస్తావు అంటూ ప్రవతియార్ మండిపడ్డాడు. వెంటనే పన్నుకట్లు అని నంగేలిని బెదిరించాడు.
అప్పటికే రాజు పెట్టిన ఈ ఆచారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి.. ప్రవతియార్ ఇంటికొచ్చి బెదిరించడం చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లిన నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసేసుకుంది. దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి.
నంగేలి వక్షోజాలను కోసుకుని వీర మరణం చెందిందనే విషయం ఆమె భర్త కండప్పన్ కు తెలియగానే ఆయన తట్టుకోలేకపోయాడు. మరుసటి దహన సంస్కారాలు ఏర్పాటు చేశారు. నంగేలిని దహనం చేస్తున్న సమయంలో భర్త కండప్పన్ ఆమె చితిలోకి దూకాడు. ఇది దేశంలో జరిగిన మొట్టమొదటి పతీ సహగమనం.
Comments
Post a Comment