*బీసీల ఓట్లతో, అధికార పీఠం మీద కూర్చొంటున్న బీజేపీ ప్రభుత్వం, బీసీల్ని నిత్యం మోసం చేస్తూ నే ఉంది. అన్ని సందర్భాల్లోనూ అణచి వేస్తూనే ఉంది.*
*తెలుసా*, తమ ఓటు బ్యాంకు లో 41% ఓట్లు వేసి, 2019 ఎలక్షన్ లో, బీసీలు బీజేపీకి 303 లోక్ సభ సీట్లు ఇచ్చారు.
-------------------------------------------------------------
1. హిందుత్వ భావనలో పీక లోతు చిక్కు కున్న అమాయక బీసీలు, అవగాహన, ఆలోచన తక్కువగా ఉంటున్న బీసీలు, తమను నిలువునా, అడ్డంగా ముంచుతున్న, తమ అవసరాలకు అడ్డుపడుతున్న, అవకాశాలకు అభివృద్ధికి దూరంగా పెడుతున్న, బీజేపీ కి మరల మరల ఓటు వేసి, తమ దౌర్భాగ్యానికి, తామే కారణం అవుతున్నారు. అనేక శతాబ్దాలుగా విద్యాపరంగా వెనుకబడిన బీసీలకు వాస్తవాలు అర్ధం కావట్లేదు.
2. *బీజేపీ ప్రభుత్వం, "సమగ్ర కుల గణన" కు మోకాలు అడ్డు పెడుతుంది.* తమ దామాషా అవకాశాల్ని తాము దక్కించుకోవడానికి, తమ స్థితి గతులు ఏమిటో, తమతో బాటు సమాజం కూడా తెలుసుకోడానికి, ఎంతగానో అవసరం అయిన "సమగ్ర కుల గణన కు" తాము వ్యతిరేకం అని, 23-9-2021 నాడు, ఒక కేసు సందర్భంగా, సుప్రీంకోర్టు లో, "బీజేపీ ప్రభుత్వం" ఒక అఫిడవిట్ దాఖలు చేసి తాము బీసీల అవకాశాలకు, అభివృద్ధికి వ్యతిరేకం, అని సమాజం ముందు రుజువు చేసుకుంది.
3. ఈమధ్యనే చేసిన *మహిళా రిజర్వేషన్ చట్టం లో,* ఆధిపత్య కులాల మహిళలకు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, రిజర్వేషన్ల రక్షణ సౌకర్యం కల్పించిన బీజేపీ ప్రభుత్వం, *బీసీ మహిళలకు మాత్రమే ఎటువంటి రిజర్వేషన్ రక్షణ సౌకర్యం లేకుండా చేసి, బీసీసమాజం అవకాశాలకు, అభివృద్ధికి తాము వ్యతిరేకం,* అని బీజేపీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసుకుంది.
4. దీనికి భిన్నంగా స్వాతంత్ర్యానంతరం, గత ఏడున్నర దశాబ్దాలుగా అన్ని రంగాల్లో, 65% నుండి 70% వరకు అవకాశాలను చే జిక్కించుకుంటూ వస్తున్న ఆధిపత్య కులాలకు, అవి సరిపోవడం లేదు, అనే రీతిలో, వారిలో, "ఆర్థిక వెనకబాటు తనం" అనే కుంటు సాకుతో, 2019 ఎలక్షన్ లకు ముందు, జనవరి 2019 లో *EWS Reservation* అనే పేరు తో 10% రిజర్వేషన్ కల్పించి, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ లకు కొంత గండి కొట్టారు.
5. ఇలా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా బీజేపీ ప్రభుత్వం, బీసీ ల్ని అణగ తొక్కుతూ వస్తుంది. ప్రధాని గారితో సహా, బీజేపీ ప్రభుత్వం బీసీల్ని నిత్యం మోసం చేస్తూనే ఉంది. బీసీలు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
*లోతైన అవగాహన తో వ్యవహరించక పోతే, బీసీలు నిత్యం, మరల, మరలా మోస పోతూనే ఉంటారు. జాగ్రత్త .....*
-- కొండలరావు
18-9-2024
Comments
Post a Comment