--- కిరణ్ కుమార్
వడ్ల వ్యాపారి మరియు రైతు
ఈ దేశంలో విచిత్రంగా నిజాయితీ ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయ జాలి ఎక్కువగా చూపేది పేదవాళ్లు లేదా మధ్య తరగతి వాళ్లు ఉంటారు అనేది ఒక రకంగా నానుడి కానీ అది నిజం.
ఈ సంఘటన నా జీవితంలో జరిగింది దోపిడీ చేసుకునే దోపిడీ వ్యాపారస్తుల విచిత్ర ఆలోచనలు మీకు తెలియచేస్తా.
గుత్తి ఒక చిన్నకారు రైతు,
బుల్లిగుప్త : వడ్ల వ్యాపారి, సెటు అంటారు
గుత్తి : ఆ సేటు నమస్తే
బుల్లిగుప్త: ఏరా గుత్తి ఎలా ఉన్నావు
గుత్తి : హా సేటు ఈ ఆ దేవుడి దయ వల్ల పంటతో వచ్చింది నాయనా ఏదో నడుస్తుంది మీలాంటి వాళ్లు మంచి చూస్తే బానే ఉంటుంది
బుల్లిగుప్త : ఆ మేమేం చేస్తాం అంత దేవుడే కానీ ఏంది మొత్తం నష్టాలను ఏం చెప్తాం,
గుత్తి : సేటు, మా ఊర్లో అనుకుంటున్నారు మీక చాలా నష్టాలు వచ్చినాయి అంట మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు,
బుల్లిగుప్త:ఏముందిలే ఈ వ్యాపారం ఉన్న తర్వాత లాభనష్టాలు ఉంటాయి కానీ బాగా ఈసారి ఇబ్బంది పడ్డాను,
గుత్తి : ఆ సేటు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈసారి సేట్ కి బాగా నష్టం వచ్చిందని మా ఊర్లో బాగా చెప్పుకున్నప్పుడు ముందే అనుకున్న నాలుగు రూపాయలు తక్కువైనా మీకే ఇద్దామని అనుకున్నాము సేటు.
బుల్లిగుప్త: ఏం చెప్పను, ఈ సంవత్సరం మూడు కోట్లు నష్టం వచ్చింది నాకు అయినా నేను చేయాలా బతకాలా ఇలాంటి రైతుల గురించి అని నేను ఆ పని చేస్తున్న కొంటున్న ధాన్యాన్ని,
ఏందే ఒడ్లు ఈట్లా ఉన్నాయి ఈసారి అంతా మంచి లేవు కదా,
గుత్తి : ఏం సేటు అట్ల అంటావు మంచి పంట వచ్చేది బాగుంది బలంగా ఈన్పు నెంబర్ వన్ వోడ్లు,
బుల్లిగుప్త: సర్లే ఇదిగో నెంబర్ వన్ ఆ నెంబర్ ఏదైనా గాని నువ్వు వచ్చినవు నేను 300 రూపాయలు ఇస్తా బస్తాకి, ఈ సారి నష్టాలు వస్తే సచుడే నేను.
గుత్తి : మరి ఏం సేటు 450 నడుస్తుంది బయట మీరు అట్లా అంటే ఎట్టా
బుల్లిగుప్త: కాదే మీరు ఇట్లా అంటే ఎట్లా ఏమి బతుకువద్దా ఇప్పటికే నష్టాలు సచ్చిపోతు ఉన్నాను మీరు ఇట్లా చెప్తే బాలేదు
గుత్తి : ఆ సేటు నిజం ఏదో ఒక రేటు నువ్వే చూసి ఈసారికి సేట్ నువ్వు కూడా బాగా నష్టం లో ఉన్నావ్ అని చెప్పినారు ఎప్పుడైనా నీ దగ్గర అమ్ముతాం కదా నీకు తెలిసేది ఏమున్నది నీకు చెప్పేదేమున్నది ఏదో ఒకటి చెయి,
బుల్లిగుప్త: సరే అయితే ఒక పని చెయ్ ఎందుకు బాధపడతావ్ రా నీకు 305 ఇస్తా
గుత్తి : సేటు బయట 400 ఇస్తానంటే కూడా నీ మీద నమ్మకంతో వచ్చినా
బుల్లిగుప్త: వద్దు వదిలేయ్ ఈసారి నేను చెబుతా 310 ఇక నాతో కాదు ఈ అదే చివరి మాటయితే ఓకే
గుత్తి : సరి సేటు నువ్వు కాంటా ఏసుకో నేను పిల్లగాడుతో వచ్చినాను గా ముందు పోయి చాయ్ తాగి వస్తాం,
రైతుతో కొడుకు అయ్యా ఈయనకి ఎందుకు అమ్మాలయ్యా మనము బయట వేరే రేట్ ఇస్తానన్నారు అన్నావ్
ఏమన్నా అందరూ ఒకటే రా ఇంకా మన సేటే నయం ఈసారి బాగా నష్టాలు వచ్చిందని చెప్తున్నాడు కదా మూడు కోట్లు నష్టం వచ్చిందని.
సరే నాయన మరే ఎట్టా ఇప్పుడు అంతా అంటే దేవుడు ఉన్నడు అంత చూసుకుంటాడు, ఏ పని కానీ ఖర్చులు చాలా అవసరం ఉన్నాయి ఇప్పుడు నాయనమ్మకు మందులు తీసుకుపోవాలి ఇబ్బంది అయితది,
డబ్బులు మరి ఇప్పుడే ఇస్తాడా సేట్ ఇప్పుడా , నెల రోజులు, 15 రోజులకి టైం పెడ్తారు.
సేట్ ని అడగాలి ఒక వెయ్యి రూపాయలు ఇయ్యమని ముందుగానే
ఇస్తాడా అడుగుదాం
సర్ చాయ్ డబ్బులు కట్టేసి కాంటా దగ్గరికి వచ్చారు,
కాంట నడుస్తుంది , రైతు ఆశ్చర్యపోయి గుత్తి : ఇదేం సేటు కాంట ఇంత మొగ్గు పోస్తా ఉన్నారు
బుల్లిగుప్త: అట్టనే ఏముంది ఏందో చెప్పు.
కొద్దిగా డబ్బులు ఇప్పుడు కొన్ని కావాలి
ఇప్పుడు ఎందుకు ఉంటది టైం పెడితే టైం పెట్టినప్పుడు ఇస్తా
గుత్తి : నీకు దండం పెడతా కొద్దిగా ఇప్పుడు కావాలా ఒక్క ₹1000 కావాలా మా అమ్మకు ఆరోగ్యం బాగుంటలే, మందులు తెచ్చి పెట్టాలా
బుల్లిగుప్త: సర్లే ఇస్తలే గాని నువ్వుందుకు ఇక్కడ ఇంక పోరి లెక్క రాసి పెడతాలే
సరే సెటూ అంటూ పోయినారు...
ఎంత గమనిస్తున్న నేను బుల్లి గుప్తా కొడుకు.
ఏమిట్రా గుత్తి మీ పట్ల చాలా సానుభూతి పడుతున్నాడు, ఆయనది మా ఊరే నీకు తెలుసా చాలా మంచి మనిషి, అడగటం మర్చిపోయినా చిన్నకారురైతు మనిషి మీ నాన్న మీద జాలి చూపెడుతున్నాడేంట్రా మూడు కోట్లు నష్టమని మీ నాన్న చెప్తున్నాడు ఏంటి
బుల్లిగుప్త కొడుకు: మా నాన్న ఈ సంవత్సరం 10 కోట్లు లాభం సంపాదించాలనుకున్నాడు కానీ కేవలం ఏడు కోట్లు లాభం సంపాదించాడు అందుకే మూడు కోట్లు నష్టమని చెప్తాడు అనుకున్నంత లాభం రాకపోతే నష్టమే కదా .
నేను : అవునా మీ నాన్న 10 కోట్లు లాభం సంపాదించుకోవాలని ఏడు కోట్లు లాభం సంపాదిస్తే మూడు కోట్లు నష్టమని చెప్తారా..!
బుల్లిగుప్త కొడుకు: అంతే కదా
నేను : అవునా నీకు తెలుసా ఇప్పుడు వచ్చిన రైతుకి కనీసం రెండు రూంలో గుడిసె కూడా లేదురా మీరు ఎమో మూడు అంతస్తుల బంగ్లా,
ఆయనేమో మీ మీద జాలి చూపెడుతున్నాడు సేటు నీకు నష్టం వచ్చింది మీకు చెప్తున్నాడు విచిత్రంగా ఉందిరా ఇంత డబ్బున్న మీ మీద కనీసం చిన్న రూమ్ కూడా లేని రైతు మీ మీద జాలి పడుతున్నాడా? పైగా మీ వ్యాపారం అర్థం కాక ఎంత రేటు ఇస్తే అంతే అని అమ్ముకుని వెళ్ళిపోయాడు నిజం అని నమ్మి.,
బుల్లిగుప్త కొడుకు:నువ్వు ఎందుకురా ఆలోచిస్తావు, ఇలానే మొదటినుంచి మేము వ్యాపారం అంటే ఇదే మరి నమ్మకం అమ్మకం ఇక్కడ వ్యాపారం
నేను : మోసం కాదా
బుల్లిగుప్త కొడుకు: అదే ఆధారం మాకు అంటూ ఇంట్లోకి పోయాడు.
Comments
Post a Comment