మత గ్రంధాల కథలన్నీ కల్పితాలే .....
******************************
అన్ని మత గ్రంధాలలో ఉన్న బుర్ర చెడగొట్టే కథలు నిజమని ప్రజలు అమాయకత్వంతో, అజ్ఞానంతో భక్తితో, భయంతో నమ్ముతున్నారు.
చెప్పేది ఏదైనా ఖచ్చితంగా,సూటిగా,సైంటిఫిక్ గా,వాస్తవాన్ని అర్థం చేసుకొని,ఊహాలోకంలో కాకుండా,వాస్తవ జీవితంలో బతకడానికి తగిన చైతన్యం,హేతువాదులు ప్రజలకు తెలియజేయాలి.
రాయి, ఒక దేవుని /దేవత రూపంగా చెక్కినప్పుడు విగ్రహంగా మారినప్పుడు, అందులో దేవత ప్రవేశిస్తుందని అది మనల్ని రక్షిస్తుందని దేవుడు/దేవత అయిపోతాడు అనేది అబద్దం. అది ప్రజలను రక్షిస్తుందని,కాపాడుతుందని నమ్మడం ఇంకా వెర్రితనం. పిచ్చితనము అజ్ఞానం.
దానికి స్నానం చేయించి,బొట్టు పెట్టి నైవైద్యం సమర్పించడం మరీ మరీ అజ్ఞానం. కొందరు తెలిసి కూడా ఆ అజ్ఞానం లోనే మనిషి బతుకుతున్నాడు. మూఢత్వంలో,మూర్ఖత్వము లో,అజ్ఞానంలో ఉండడమే ప్రజలకు చాలా సుఖంగా,సులభంగా ఉన్నట్టుగా ఉన్నది. ప్రతిదానికి తలూపుతూ పోవచ్చు అనుకుంటున్నాడేమో
రూపు మారినంత మాత్రాన రాయి రాయే కానీ, రాయిలో ఉన్న పదార్థ లక్షణాలే ఉంటాయి.
కానీ ఇతరత్రా లక్షణాలు ఏమీ సంక్రమించవు. బొమ్మగా మారిన రాయి లోకి అద్భుత శక్తులు వస్తాయనే ప్రచారం చేసే వారికి కూడా, అది శుద్ధ అబద్ధం,పచ్చి మోసం అని తెలుసు.
అయినా బుర్రపాడు చేసే కథలు నిజమే ననుకుంటూ మత పెద్దలు చెప్పినట్టు, బొమ్మల్లాగా చేస్తూనే ఉంటారు. చాలామంది ప్రజలు అదే లోకంలో బతుకుతున్నారు.
అది ఎంతవరకు నిజమో? ఎవరూ ఆలోచించడం లేదు.
పేదవాళ్లు సంపాదించే ఒకటో రెండో రూపాయలు,వారికి అర్థం కాని భాషా
పదాలు, మోసపూరిత కల్పిత మాటలు ( స్వర్గము,నరకముమోక్షము ఆత్మ, మాయమవడం,ప్రత్యక్షమవడం,కారణజన్ములు, దైవ లీలలు,పుణ్యము,పాపము,గత జన్మ,, పునర్జన్మ, దేవతలు,రాక్షసులు,దేవుడు దయ్యము, ఇంకా లక్షలాది పదాలు ఉన్నాయి ఆ పదాలన్నీ రాయాలంటే ఒక గ్రంథమే తయారవుతుంది)ఉపయోగించి,ప్రజలను మోసగించి ,తద్వారా స్వార్థపరులు, దోపిడీదారులు దోపిడీ చేసి తాము సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నారు.
మనం ఆచరించే ఆచారాలను,సంప్రదాయాలను వారికి అనుకూలంగా మలుచుకుని మరెన్నో నియమాలను చేర్చి ప్రజలను నిరంతరం దోచుకుంటూనే ఉన్నారు,
దేవుని పేరుతో సుమారు 90 శాతం వరకు ఆచారాలు సంప్రదాయాలు మనలో జీర్ణించుకొని ఉంటాయి. వాటన్నింటినీ నిర్మూలించాలంటే దేవుడు అనే ఒక భావనను ప్రజల నుండి దూరం చేయడమే హేతువాదుల ప్రస్తుత కర్తవ్యం.
దేవుడి పేరుతో ఆచరించేటివన్నీ కేవలం ఊహలతో ఆచరించేవి కానీ వాటికి సరైన అవసరం కానీ, లేదు. అవన్నీ కూడా దోపిడీదారుల స్వార్థ పరుల కోసం సృష్టించినవే. దేవుడు అనే భావన కేవలం ఒక అపోహ. అజ్ఞానంతో కూడుకున్న భావన తప్ప ఎవరికీ దేవుడనేవాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో కనిపించింది లేదు.సాక్ష్యం లేదు.ఆధారం లేదు.
మత గ్రంథాల కథల లోని పాత్రలకు లేని మహిమలు అంటగట్టి, వారిని దైవాంశ సంభూతులుగా చిత్రించి గుళ్ళుగోపురాలు కట్టి, ప్రార్థన స్థలాలు కట్టి వాటిపై కథల కథలుగా రాసి, పాటలతో పద్యాలతో వారిని స్తుతిస్తూ, శ్లోకాల రూపంలో పాటల రూపంలో ప్రార్థించడం వలన ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. మత గ్రంథాలలోని కథలు కల్పితాలే, కట్టుకథలే,పిట్టకథలే తప్ప అవి ఎప్పుడు నిజాలు కావు.
ఏ దేశంలో స్త్రీలని పూజించరో ఆ దేశంలో'ని స్త్రీలు ఒకరిపై ఆధారపడకుండ గౌరవంగా బతుకుతున్నారు.
ఏ దేశం'లో ఆవులను పూజించరో ఆ దేశంలోని ఆవులు ఎక్కువ పాలను ఇస్తూ రోడ్లపై హీనంగా చావకుండ యజమానుల సంరక్షణలో ఆరోగ్యం'గా జీవిస్తున్నాయి.
ఏ దేశంలో నదులను పూజించట్లేదో ఆ దేశంలోని నదులు శుభ్రంగ ప్రవహిస్తున్నాయి.
ఏ దేశంలో రాళ్ళనీ, రప్పలనీ పూజించరో ఆ దేశంలోని ప్రజలు ఎంతో తెలివిగా టెక్నాలజీ'లో దూసుకుపోతున్నారు.
ఏ దేశంలో కుల, మతాలు లేవో ఆ దేశంలోని ప్రజలు ఒకరిపై ఒకరు రాగద్వేషాలు వ్యత్యాసాలు లేకుండ సమానత్వం'తో జీవిస్తున్నారు.
దేవుని విషయాన్ని మనం పరిశీలిస్తే..........
********************************
దేవుడి విగ్రహాన్ని మనిషే చెక్కాలి.
గుడిని మనిషే కట్టాలి.
మనిషే విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
మనిషే విగ్రహానికి అభిషేకాలు చేయాలి.
మనిషే పుష్పాలు, ఆకులు సమర్పించాలి. నైవేద్యం మనిషే పెట్టాలి.
ఆయన ముందు సాగిలబడి నమస్కారాలు చేయాలి. మనుషులకు ఏ కష్టం వచ్చినా,ఏ అవసరం వచ్చినా చివరికి మనిషే తీరుస్తున్నాడు. ఎవరు ఎన్ని రకాలుగా పూజలు చేసినా.ఎంత మొత్తుకున్నా.ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సమయంలోనూ దేవుడు తీర్చింది లేదు కనబడింది లేదు.అన్నీ మనిషే చేసిన తర్వాత ఇక దేవుడి పాత్ర ఏమిటి?
కొందరు దేవుని పేరుతో వ్యాపారాలు చేసి లక్షలాది రూపాయలు లాభాలు సంపాదిస్తూ ఉంటే, మరికొందరు పనిచేయకుండా కూర్చుని సోమరిపోతుల లాగా జీవిస్తున్నారు.
ఈ విషయం ప్రజలకు తెలియనంత వరకు, గ్రహించనంతవరకు మోసాన్ని గ్రహించే శక్తి వచ్చేంతవరకు, ఈ దోపిడీ నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది.
మోసపూరిత పదాలు మనిషిగా కాకుండా ఇంకా అజ్ఞానం లోకి తోస్తున్న పచ్చి నిజాన్ని తెలుసుకునేంత వరకు మనిషి మూఢనమ్మకాలలో బతకాల్సిందే.
హేతుబద్ధమైన ఆలోచన అనేది గొప్పది.
ఏది నిజం ఏది నిజం కాదు అని ఆలోచించే విధానమే గొప్పది.
సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రమే తెలుస్తుంది.
మూఢ నమ్మకంలో మునిగి పచ్చిమిరపకాయ కూడా నిమ్మకాయతో, జీడి గింజల తో కలిపి పెడితే ప్రమాదాలు జరగవు అని అంతే మంచి జరుగుతుందని నమ్మడం మూర్ఖత్వం.
నమ్మకాలు కొన్ని పదాలు మనిషిని మూఢత్వం లో ఉంచుతున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది అనే ధోరణి ఉన్న మనమందరం కలిసినప్పుడు మనిషికి మనిషికి సహాయం అనేది ప్రాక్టికల్ గా జరగాలి అనేది నా ఉద్దేశ్యం మంత్రంతో ఏదైనా సాధించొచ్చు అనే పదాలు అవి నిజం అనుకునేవాళ్ళు 99% ఉన్నారు నీకు తెలుసుంటది మంత్రంతో ఏమీ సాధించలేమని మరి నమ్మి మోసపోయే వాళ్ళని ఎలా బయటికి తీసే మీరు చెప్పేది ముమ్మాటికీ పొరపాటు మనిషిని మోసం చేస్తూనే ఉంటాయి అందుకే పదములు నిజంగా ప్రాక్టికాలిటీ నిబద్ధత ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో చదువుకున్న అజ్ఞానులు, చదువుకొని నిరక్షరాస్యులు అందరూ మూఢనమ్మకాల ఊబిలో మునిగి తేలుతున్నారు.
మత గ్రంథాలన్నీ కల్పితమే. అందులో పేర్కొన్న కథలు పాత్రలు అన్నీ కూడా ఒక వర్గ ప్రయోజనం కోసమే సృష్టించబడినవి. వాటిని చదువుకోవడం, నిజమనుకోవడం మూర్ఖత్వం. ప్రజలను మభ్యపెట్టి దోచుకోవడానికి పన్నిన ఉపాయమే కానీ వేరొకటి కాదు రాళ్ల ముందు బోర్లా పడేటట్టు చేసి సోమరిపోతులైన కొందరు దోపిడీదారులు కూర్చుని తినే పరాన్న బుక్కులుగా సుఖాలనుభవించాలని దురుద్దేశంతో దుష్టపన్నాగం పన్ని ప్రజలను రకరకాల పూజలతో, యజ్ఞాలతో, యాగాలతో, ప్రార్థనలతో, ప్రేయర్ ఆయిల్ లాంటి చిట్కాలతో మోసాలు చేసి బతుకుతున్నారు.
సాధారణ ప్రజలు, అక్షర జ్ఞానం లేని వారు అమాయకులు తమ సంపదను తమ కష్టార్జితాన్ని వారికి కారణము లేకుండా సమర్పించి పేదవాళ్ళు గానే ఉండిపోతున్నారు. ప్రభుత్వం వారు కూడా కులమతాల భావనలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు, వాస్తవాలు తెలపాల్సిన వారు కూడా అబద్దాలలో ఉండడం వలన ప్రజలు కూడా వారిని ధనవంతులను ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నారు. ఆదర్శంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలకు, ధనవంతులకు ప్రజలు అజ్ఞానంలో ఉండడమే ఇష్టం. ప్రజల అజ్ఞానంలో ఉంటేనే మంచిది. ధనవంతులు,ప్రభుత్వం ఇద్దరు దోపిడీదారులే కాబట్టి తమ దోపిడీకి అనుకూలంగా ప్రజలు అజ్ఞానంలో ఉంటేనే మంచిదని భావిస్తారు.
ఈ విషయంలో చదువుకున్న వారు సైతం మూఢనమ్మకాలను నమ్మడం శోచనీయం.
సైన్స్ చదువుకున్న విద్యార్థులు కానీ ఉన్నత చదువులు చదివిన వారు కానీ దేవుడున్నాడనే భ్రమలో ఉండడం ఈ దేశ దౌర్భాగ్యం. మత గ్రంథాలు కేవలం కాలక్షేపానికి చదవడానికి పనికి వస్తాయి తప్ప, అందులో ఉన్న విషయాన్ని నిజాలేనని నమ్మి తే మోసగాళ్ల వలలో చిక్కినట్టే. అందు వలన స్వీయ ఆలోచనతో అన్నింటిని ప్రశ్నించి విశ్లేషించి ఏది అబద్ధం? ఏది నిజము నిజమైన దానిని ఆచరించవలసి ఉంటుంది.....
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం
Comments
Post a Comment