(ప్లీజ్ దయచేసి పూర్తిగా చదవండి)
మనం బతకవలసినది మనుషుల గురించి,
రాతి బొమ్మల కోసం కాదు
మనం ఆలోచించవలసినది మనుషుల గురించి రాతి బొమ్మల కోసం కాదు
మనం మాట్లాడవలసినది మనుషుల గురించి, రాతి బొమ్మల కోసం కాదు.
మన సమయాన్ని వెచ్చించడం మనుషుల కోసం,
రాతి బొమ్మల కోసం కాదు.
మన ఇష్టాన్ని పెంచుకోవడం మనుషుల మీద, రాతి బొమ్మల మీద కాదు
మనం గౌరవించవలసినది మనుషులను, రాతి బొమ్మలను కాదు.
మన సుఖం,సంతోషము,ఆనందం మనుషుల వల్ల, రాతి బొమ్మల వలన కాదు
మనం సంపాదించిన ధనం మనుషుల గురించి, రాతి బొమ్మల గురించి కాదు.
మనం దానం చేయవలసినది మనుషులకు, రాతి బొమ్మలకు కాదు
మనము పెళ్లిళ్లు చేయవలసినది మనుషులకు, రాతి బొమ్మలకు కాదు.
మనం స్నానం చేయించవలసినది మనుషులకు, రాతి బొమ్మలకు కాదు.
మనం వస్త్రాలను తొడిగించడం మనుషులకు. రాళ్ల కు కాదు.
మనం ఇల్లు కట్టవలసినది మనుషుల కోసం, రాళ్లకు కాదు.
మనం ఆభరణాలు వేయవలసినది మనుషులకు, రాళ్లకు కాదు.
మనం భోజనం పెట్టవలసినది మనుషులకు,
రాళ్లకు కాదు.
మన కార్యక్రమాలు మనుషుల కోసం,
రాళ్లకు కాదు.
మనం ప్రేమించవలసినది మనుషులను,
రాళ్లను కాదు.
మన పోరాటాలు మనుషుల అభ్యుదయం కోసం, రాళ్ల కోసం కాదు
మనం చదవవలసినది మత గ్రంథాలు కాదు,
వైజ్ఞానిక గ్రంథాలు.
.......................... అడియాల శంకర్.
సముద్రాన్ని చూస్తాం కానీ
సముద్రపు నీటిలో ఉన్న ఉప్పును చూడలేము.
అలాగే మనుషులను చూస్తాం కానీ
మనిషి మనసులో ఏముందో......... చూడలేము
............. అడియాల
Comments
Post a Comment